ETV Bharat / business

యాప్​ ఇన్నోవేషన్ ఛాలెంజ్​కు గడువు పెంపు

'ఆత్మ నిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్​ ఛాలెంజ్'కు ఎంట్రీలు పంపేందుకు కేంద్రం గడువు పెంచింది. సాంకేతిక నిపుణుల నుంచి స్పందన భారీగా వస్తున్న నేపథ్యంలో జులై 18 నుంచి 26 వరకు గడువు పొడగించింది.

app innovation challenge
యాప్​ ఇన్నోవేషన్ ఛాలెంజ్
author img

By

Published : Jul 18, 2020, 4:06 PM IST

దేశీయంగా ప్రపంచ స్థాయి యాప్​లను రూపొందించేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన 'ఆత్మ నిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్​ ఛాలెంజ్' ఎంట్రీలకు గడువు పెంచింది కేంద్రం. ఈ ఛాలెంజ్​కు సాంకేతిక నిపుణుల నుంచి భారీ స్పందన వస్తున్నందున.. ఎంట్రీలను పంపేందుకు ఈ నెల 26వరకు గడువు పెంచినట్లు తెలిపింది. ఇంతకు ముందు ఈ గడువు జులై 18గా నిర్ణయించింది. ఈ ఛాలెంజ్‌ను ప్రధాని నరేంద్రమోదీ జులై 4న ప్రారంభించారు. మైగవ్.ఇన్​ ద్వారా ఔత్సాహికులు తమ స్పందనలు పంపించొచ్చు.

ఇప్పటి వరకు వచ్చిన స్పందన..

ఇప్పటివరకు ఈ ఛాలెంజ్​లో భాగంగా 8 విభాగాల్లో, 2,353 ఎంట్రీలు వచ్చినట్లు కేంద్ర ఐటీ సమాచారశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్​ ట్వీట్​ చేశారు.

ఇందులో 1,496 ఎంట్రీలు వ్యక్తిగతంగా.. 857 ఎంట్రీలు వివిధ సంస్థల నుంచి వచ్చినట్లు ఈ ఛాలెంజ్ నిర్వహిస్తున్న నీతి ఆయోగ్, కేంద్రం ఐటీ సమాచార మంత్రిత్వ శాఖలు వెల్లడించాయి. ఎంట్రీల్లో 788 యాప్​లు ఉపయోగించేందుకు సిద్ధంగా ఉండగా, 708 యాప్​లు ఇంకా అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలిపాయి.

విభాగాల వారీగా ఇలా..

  • 380 యాప్​లు- వ్యాపారం
  • 286 యాప్​లు- ఆరోగ్య, సంక్షేమం
  • 339 యాప్​లు- ఈ- లెర్నింగ్‌
  • 414 యాప్​లు- సోషల్ నెట్​వర్కింగ్
  • 136యాప్​లు- గేమింగ్
  • 238యాప్​లు- ఆఫీస్, వర్క్​ ఫ్రం హోం
  • 75యాప్​లు- వార్తలు
  • 96యాప్​లు- వినోదం
  • 389యాప్​లు- ఇతర విభాగాలు

ఇదీ చూడండి:వీధి వ్యాపారులకు మొబైల్‌ యాప్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.