దేశాన్ని కరోనా కుదిపేస్తున్న వేళ కొన్ని కార్పొరేట్ కంపెనీలు తమ సిబ్బందికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నాయి. ప్రముఖ ఇంజనీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్ & టూబ్రో (ఎల్&టీ) ఉద్యోగులు కరోనా బారిన పడితే.. వారికి, వారి కుటుంబానికి ఆర్థికంగా భరోసానిచ్చేందుకు బీమా పథకాన్ని ఆవిష్కరించించింది.
ఈ ఐచ్ఛిక పాలసీ కరోనా సంబంధిత రోగాలకు గానూ.. ఒక్కో ఉద్యోగికి రూ.35 లక్షల బీమా చెల్లంచనున్నట్లు వెల్లడించింది. పాలసీ పీరియడ్‌ను 12 నెలలుగా పేర్కొంది.
కొవిడ్-19 వల్ల ఎవరైనా ఉద్యోగి మరణిస్తే.. ఏక మొత్తంలో రూ.35 లక్షలు చెల్లించనున్నట్లు వివరించింది ఎల్&టీ.
రూ.50-60 లక్షల వరకు కవరేజీనిచ్చే సంస్థ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు ఇది అదనపు పాలసీ అని స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ వృథాను తగ్గించేంద సిరంజీలు..
భారత్‌లో వ్యాక్సినేషన్ సామర్థ్యాన్ని పెంచేందుకు గాను శాంసంగ్ మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా.. ఇంజెక్షన్ ద్వారా వ్యాక్సినేషన్ వృథాను తగ్గించేందుకు.. లో డీడ్ స్పేస్ (ఎల్డీఎస్) సిరంజీలను దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రకటించింది. మొత్తం 10 లక్షల సిరంజీలను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపింది.
ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖ్‌నవూ, నోయిడా జిల్లా యంత్రాంగానికి 3.25 లక్షల ఎల్డీఎస్ సిరంజీలను పంపిణీ చేసినట్లు శాంసంగ్ వెల్లడించింది. త్వరలోనే చెన్నైకి 3.5 లక్షల ఎల్డీఎస్ సిరంజీలను ఇవ్వనున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి:టాటా స్టీల్: కరోనా మృతుల కుటుంబాలకు వేతనం