ఐసీఐసీఐ-వీడియోకాన్ అక్రమ రుణ మంజూరు కేసులో పట్టు బిగిస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. నేడు విచారణకు హాజరుకావాలంటూ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ప్రధాన కార్యనిర్వహణాధికారి చందాకొచ్చర్, వీడియోకాన్ ప్రతినిధి వేణుగోపాల్‌కు సమన్లు జారీచేసింది. ఈడీ ఆదేశాల మేరకు కార్యాలయానికి భర్త దీపక్ కొచ్చర్తో కలిసి వచ్చారు చందా కొచ్చర్.
శుక్రవారమే కొచ్చర్, వేణుగోపాల్ నివాసాలు సహా ముంబైలోని ఐదు కార్యాలయాల్లో సోదాలు జరిపింది ఈడీ.
వీడియోకాన్‌కు అక్రమ మార్గంలో రూ.1875 కోట్ల రుణాన్ని మంజూరు చేశారని ఆరోపిస్తూ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వేణుగోపాల్‌పై ఈడీ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసులో సాక్ష్యాలు కోసమే శుక్రవారం ఈడీ సోదాలు జరిపింది.
ఇదీ చదవండి: కొచ్చర్ ఇంట్లో సోదాలు..