ETV Bharat / business

పాస్​వర్డ్​ సేవ్​ చేయకుండా 'బ్రౌజర్​' నియంత్రణ ఎలా? - పాస్​వర్డ్​లు సేవ్​ అవకుండా బ్రౌజర్​పై నియంత్రణ

సిస్టమ్​లో వాడే ప్రతి బ్రౌజర్​లో ఇన్​బిల్ట్​గా ఉన్న పాస్​వర్డ్​ మేనేజర్లు.. మీ లాగిన్​ పాస్​​వర్డ్​లను సేవ్​ చేసుకుంటుంటాయి. మీరు పదే పదే లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఇది ఉపయోగపడుతుంది. కానీ మీ సిస్టమ్​ను ఇతరులు వాడితే మీ ప్రైవసీకి ఇబ్బందే కదా! అందుకే.. పాస్​వర్డ్​ను సేవ్​ చేసుకోకుండా మీ బ్రౌజర్​ని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి ఇప్పుడే..

Browser control over passwords
పాస్​వర్డ్​ సేవ్​ చేస్కోకుండా బ్రౌజర్​పై నియంత్రణ
author img

By

Published : Apr 9, 2021, 8:29 AM IST

బ్రౌజర్‌ ఏది వాడుతున్నప్పటికీ దాంట్లో కచ్చితంగా బిల్ట్‌ఇన్‌ పాస్‌వర్డ్‌ మేనేజర్‌ ఉంటుంది. అది ఎప్పటికప్పుడు మిమ్మల్ని అడుగుతూ లాగిన్‌, పాస్‌వర్డ్‌ వివరాల్ని బ్రౌజర్‌లోనే సేవ్‌ చేస్తుంటుంది. దీంతో పదే పదే లాగిన్‌ తాళాల్ని ఎంటర్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీ సిస్టమ్‌ని మీరు మాత్రమే కాకుండా ఇతరులు వాడే అవకాశం ఉంటే..? అప్పుడు మీ ప్రైవసీ పరిస్థితి ఏంటీ? అందుకే ఆయా బ్రౌజర్లలో ఉన్న పాస్‌వర్డ్‌ మేనేజర్‌ని డిసేబుల్‌ చేయడం ఒకరకంగా మంచిదే. ముఖ్యంగా.. పబ్లిక్‌ కంప్యూటర్లలో మీరు వెబ్‌ విహారం చేస్తున్నట్లయితే కచ్చితంగా పాస్‌వర్డ్‌ మేనేజర్‌ని టర్న్‌ఆఫ్‌ చేయాల్సిందే. అదెలాగో కాస్త వివరంగా తెలుసుకుందాం!

గూగుల్‌ క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌, ఎడ్జ్‌.. దేంట్లోనైనా పాస్‌వర్డ్‌ మేనేజర్‌ని మేనేజ్‌ చేసేందుకు ప్రత్యేక ఆప్షన్‌ ఉంది. ఎలాంటి యాడ్‌ఆన్స్‌తో పని లేదు.. సెట్టింగ్స్‌లో మార్పులు చేయక్కర్లేదు. చాలా సింపుల్‌గా ఆన్‌ లేదా ఆఫ్‌ చేయొచ్చు. అందుకు మీరేం చేయాలంటే.. క్రోమ్‌ వాడుతున్నట్లయితే మూడు చుక్కలపై (మెయిన్‌ మెనూ) క్లిక్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. వచ్చిన ఆప్షన్స్‌లో 'ఆటో-ఫిల్‌' విభాగం కనిపిస్తుంది. దాంట్లోని 'పాస్‌వర్డ్‌'పై క్లిక్‌ చేస్తే Offer to Save Passwords కనిపిస్తుంది. పక్కనే ఆన్‌, ఆఫ్‌ చేయడానికి బటన్‌ ఉంటుంది. దాన్ని ఎనేబుల్‌ చేస్తే.. పాస్‌వర్డ్‌లు సేవ్‌ అవుతాయి. ఒకవేళ డిసేబుల్‌ చేస్తే ఎప్పటికీ లాగిన్‌ తాళాలు సేవ్‌ అవుతాయనే ఊసే ఉండదు. ఒకవేళ ఇప్పటికే ఏవైనా లాగిన్‌ తాళాల్ని సేవ్‌ చేసుంటే.. ఆటోమేటిక్‌గా లాగిన్‌ అయ్యేందుకు వీలు లేకుండా 'ఆటో సైన్‌-ఇన్‌' ఆప్షన్‌ని కూడా డిసేబుల్‌ చేయండి.

Chrome
క్రోమ్​లో

ఫైర్‌ఫాక్స్‌ యూజర్లు అయితే..

ఓపెన్‌సోర్స్‌ కమ్యూనిటీ మొజిల్లా అందించే ఫైర్‌ఫాక్స్‌ని వాడుతున్నట్లయితే మూడు అడ్డ గీతలపై (మెయిన్‌మెనూ) క్లిక్‌ చేసి 'ఆప్షన్స్‌'లోకి వెళ్లండి. వచ్చిన విండోలోని ఎడమవైపు కనిపించే 'ప్రైవసీ, సెక్యూరిటీ' విభాగాన్ని సెలెక్ట్‌ చేయాలి. దాంట్లో 'లాగిన్‌ అండ్‌ పాస్‌వర్డ్స్‌'లో Ask to save logins and passwords for website కనిపిస్తుంది. దాన్ని డీసెలెక్ట్‌ చేయాలి. అంతే.. పాస్‌వర్డ్‌లను సేవ్‌ చేయమంటారా? అంటూ డైలాగ్‌ బాక్స్‌లు కనిపించవు. ఒకవేళ మీరు ఏవైనా ప్రత్యేక వెబ్‌సైట్‌ల లాగిన్‌ తాళాలు మాత్రమే సేవ్‌ అవ్వకూడదు అనుకుంటే.. అందుకు exceptions ఆప్షన్‌ ఉంది. దాంట్లోకి వెళ్లి జాబితాని ఎంటర్‌ చేయొచ్చు.

in Firefox
ఫైర్​ ఫాక్స్​లో

ఎడ్జ్​ బ్రౌజర్​లో..

మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌లోనూ పాస్‌వర్డ్‌ మేనేజర్‌ని అవసరమైనట్లు మార్చుకోవచ్చు. అందుకు మెయిన్‌ మెనూని ఓపెన్‌ చేసి 'సెట్టింగ్స్‌'లోకి వెళ్లండి. వచ్చిన మెనూలోని 'ప్రొఫైల్స్‌'ని సెలెక్ట్‌ చేస్తే 'పాస్‌వర్డ్స్‌' విభాగం కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్లి.. Offer to save passwords ఆప్షన్‌ని టర్న్‌ఆఫ్‌ చేయండి. అంతేకాదు.. దీంట్లోనూ ఆటోమేటిక్‌గా లాగిన్‌ అవ్వొద్దు అనుకుంటే 'సైన్‌ ఇన్‌ ఆటోమేటికల్లీ' ఆప్షన్‌ని డిసేబుల్‌ చేయొచ్చు.

Edge
ఎడ్జ్​లో ఇలా..

ఇదీ చదవండి:రియల్​మీ నుంచి ఒకేసారి మూడు బడ్జెట్ ఫోన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.