ETV Bharat / business

ట్వీట్లు.. ఫీట్లు.. అమ్మితే కోట్లు! - నాన్​ ఫంగిబుల్​ టోకెన్స్

ఇప్పుడు డిజిటల్​ ప్రపంచాన్ని ఓ నయా ట్రెండ్​ ఊపేస్తుంది. అదే ఎన్​ఎఫ్​టీ. ట్వీట్లు, పాటలు, చిత్రాలు ఇలా దాదాపు అన్నింటిని డిజిటల్ రూపంలో అమ్మేందుకు, కొనేందుకు వినియోగిస్తున్న టెక్నాలజీనే ఎన్​ఎఫ్​టీ. అదేంటీ ట్వీట్​ను అమ్మడం.. కొనడమా? అని ఆశ్చర్యపోతున్నారా? మరి దాని వెనకున్న అసలు విషయమేమిటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Tweets
ట్వీట్లు
author img

By

Published : Mar 26, 2021, 7:48 AM IST

ఒక ట్వీట్​ను వేలం వేయడమేంటి! దాన్ని కొనడానికి పోటీపడటమేంటి!.. ట్విట్టర్​ సీఈఓ జాక్​ డోర్సీ తొలి ట్వీట్ వేలంలో రూ. 21కోట్లకు అమ్ముడుపోయిందని తెలిసినప్పుడు అందరిలోనూ అదే ఆశ్చర్యం. అసలు ఒక ట్వీట్​ను ఎందుకు కొంటారు? కొంటే ఏం వస్తుందన్న సందేహాలూ కలిగాయి. అది అర్థమవ్వాలంటే డిజిటల్ ప్రపంచాన్ని ఊపేస్తున్న నాన్​ ఫంగిబుల్​ టోకెన్స్​(ఎన్​ఎఫ్​టీ) గురించి తెలుసుకోవాల్సిందే. వీటి ద్వారా ట్వీట్లు, క్రీడాకారుల ఫీట్లు, అభిమాన గాయకుడి పాటలు, ప్రముఖ చిత్రకారుడి కళాఖండం ఇలా దేన్నైనా ఎంచక్కా కొనుక్కోవచ్చు. వాటికి యజమానులై పోవచ్చు. అయితే ఓ షరతు.. అది డిజిటల్​ ప్రపంచంలో మాత్రమే. కొన్ని నెలల్లోనే మిలియన్ల డాలర్ల వ్యాపారంగా ఎదిగి ఎలాన్​ మస్క్​ లాంటి ప్రముఖులనూ ఆకర్షిస్తోంది ఎన్ఎఫ్​టీ సామ్రాజ్యం.

ఏమిటీ ఎన్​ఎఫ్​టీ?

నాన్​ ఫంగిబుల్​ టోకెన్స్​(ఎన్​ఎఫ్​టీ) అంటే ఒక్క మాటలో డిజిటల్​ ఆస్తులు అని చెప్పొచ్చు. డిజిటల్​ మాధ్యమంలో సృష్టించిన ట్వీట్​, చిత్రం, వీడియో లాంటి సృజనను సదరు రూపకర్త అమ్మకానికి ఉంచొచ్చు. దాన్ని డిజిటల్​ వెర్షన్​ను కొన్న వారికి అందుకు సంబంధించిన యాజమాన్య హక్కులను బదలాయిస్తారు. ఆ డిజిటల్​ ఫైల్​కు బ్లాక్​ చెయిన్​ సాంకేతిక పరిజ్ఞానంతో ఓ విశిష్ఠ సంఖ్యను కేటాయిస్తారు. అంటే ఆ డిజిటల్​ వెర్షన్​ ప్రపంచంలో ఒక్కటే ఉంటుంది. దానికి ఒక్కరే యజమాని ఉంటారు. దీంతోపాటు యాజమాన్య వివరాలను బ్లాక్​ చెయిన్​ ఆధారిత పబ్లిక్​ లెడ్జర్​లో నమోదు చేస్తారు. దీని ద్వారా ఆ డిజిటల్​ వెర్షన్​కు యజమాని ఎవరన్నది ప్రపంచంలో ఎక్కడ నుంచైనా ఎవరైనా చూడొచ్చు. హ్యకింగ్​కు వీలుకాని బ్లాక్​ చైన్​ సాంకేతికత వల్ల యాజమాన్య వివరాలను ఇతరులెవరూ మార్చడానికి సాధ్యం కాదు. భవిష్యత్తులో ఆ డిజిటల్ ఫైల్​ను ఇంకెవరికైనా అమ్ముకోవచ్చు. అలా జరిగే లావాదేవీల వివరాలనూ డిజిటల్​ లెడ్జర్​లో నమోదు చేస్తారు.

మిలియన్ల డాలర్ల మార్కెట్​

ఎన్​ఎఫ్​టీల ట్రెండ్​ 2017లో మొదలైనప్పటికీ 2020 చివరి నుంచి ఊహించని రీతిలో పుంజుకుంది. గతేడాదే ఎన్​ఎఫ్​టీ మార్కెట్​ విలువ దాదాపు మూడింతలు పెరిగిందని, ప్రస్తుతం అది దాదాపు 250 మిలియన్ల డాలర్లకు చేరిందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇది మరింత వేగంగా విస్తరిస్తుందని అంటున్నారు.

కాదేదీ అమ్మకానికి అనర్హం..

ట్వీట్లు, క్రీడల వీడియోలు, డిజిటల్​ చిత్రాలు, ఫోటోలు, పాటలు, టెక్ట్స్​ ఇలా అన్నిటినీ ఎన్ఎఫ్​టీల రూపంలో అమ్మకానికి ఉంచుతున్నారు. అరుదైన వస్తువులను సేకరించడం హాబీగా ఉన్నట్లే ఇప్పుడు ఎన్​ఎఫ్​టీలను సొంతం చేసుకోవడం క్రేజ్​గా మారింది. ఈ ధోరణి చిత్రకారులు, సంగీత కళాకారులు, క్రీడలు, వినోద రంగ సంస్థలకు వరంలా మారింది. డిజిటల్​ చిత్రకారుడు మైక్​ వింకిల్​మాన్​ గీసిన ఓ చిత్రం 6.9 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. కరోనాతో కచేరీలు రద్దై ఇబ్బందులు పడుతున్న సంగీత కళాకారులకు ఎన్ఎఫ్​టీలు కొత్త ఆదాయ మార్గాలుగా మారాయి. వారు తమ పాటలను రికార్డు చేసి డిజిటల్​ వెర్షన్​ను అమ్ముతున్నారు. ఆ ఎన్​ఎఫ్​టీలపై భవిష్యత్తులో జరిగే క్రయవిక్రయాలపైనా వారికి రాయల్టీ అందుతుంది. డీజే కళాకారుడు జస్టిన్​ బ్లా ఆల్బమ్​కు ఎన్​ఎఫ్​టీల రూపంలో 17 మిలియన్ల డాలర్లు వచ్చాయి. నేషనల్​ బాస్కెట్​ బాల్​ అసోసియేషన్​ సంస్థ ఆటలోని హైలెట్ల వీడియోలను వేల డాలర్లకు విక్రయిస్తోంది. ఇతర వినియోగదారులు వాటిని య్యూట్యూబ్​లో ఉచితంగా వీక్షించే వెసులు బాటు ఉన్నా తమకు నచ్చిన ఆటగాళ్లకు సంబంధించిన డిజిటల్​ వెర్షన్​లను సొంతం చేసుకోవలన్న భావనతో అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. డిజిటల్​ వెర్షన్​లకు కాలం గడిచేకొద్దీ అదనపు విలువ చేకూరుతుందని, అవి భవిష్యత్తులో మరింత ఎక్కువ ధరకు అమ్ముడుపోతాయన్నది విశ్లేషకుల మాట. 'ఇది కేవలం ట్వీట్​ కాదు.. మోనాలిసా చిత్రంలాగా దీని అసలైన విలువ ఎంతో భవిష్యత్తులో తెలుస్తుంది' అని డోర్సీ తొలి ట్వీట్​ను కొన్న సినా ఎస్టవీ చెప్పడం గమనార్హం. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్​ మస్క్​ ఎన్​ఎఫ్​టీల క్రేజ్​పై రూపొందించిన ఓ పాటను వేలానికి ఉంచారు.

ఇదీ చదవండి: 'మోదీ కృషితో ప్రైవేట్​ రంగంలో అపార అవకాశాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.