ETV Bharat / business

వేధిస్తున్న చిప్​ల​ కొరత- క్షీణించిన వాహన విక్రయాలు - చిప్​ కొరతతో వాహనాల ఉత్పత్తి

గత కొన్ని నెలలుగా ఆటోమొబైల్​ రంగాన్ని చిప్​ల​ కొరత(Chip Shortage) వేధిస్తోంది. దీంతో భారీ స్థాయిలో వాహన విక్రయాలు(Chip Shortage auto sales) పడిపోయాయి. దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ(ఎంఎస్‌ఐ) వాహన విక్రయాల్లో 24% క్షీణత కనిపించింది. ఇదే తరహా పరిస్థితిని పలు ఇతర కంపెనీలు కూడా ఎదుర్కొంటున్నాయి.

Chip Shortage
చిప్​ల​ కొరత
author img

By

Published : Nov 2, 2021, 5:27 AM IST

వాహన తయారీ కంపెనీలను ఎలక్ట్రానిక్‌ చిప్‌ల కొరత(Chip Shortage in auto industry) ఇంకా వేధిస్తూనే ఉంది. గత కొన్ని నెలలుగా ఈ కారణంగానే భారీ స్థాయిలో విక్రయాలు పడిపోయాయి. అక్టోబరులోనూ పరిస్థితి(Chip Shortage) ఏమీ మారలేదు. కీలక సంస్థల విక్రయాలు(Chip Shortage auto sales) పడిపోయాయి. దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ(ఎంఎస్‌ఐ) వాహన విక్రయాల్లో 24% క్షీణత కనిపించింది. గత నెలలో అమ్మకాలు 1,38,335 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2020 అక్టోబరులో ఈ కంపెనీ 1,82,448 వాహనాలు విక్రయించింది. ఎంఎస్‌ఐ దేశీయ విక్రయాలు 1,72,862 నుంచి 32 శాతం తగ్గి 1,17,013కి పరిమితమయ్యాయి.

చిన్న కార్లలో ఆల్టో, ఎస్‌-ప్రెసోల విక్రయాలు 28,462 నుంచి 21,831కు పడిపోయాయి. కాంపాక్ట్‌ కార్ల విభాగంలో స్విఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ విక్రయాలు 49 శాతం తగ్గి 48,690కి తగ్గిపోయాయి. మధ్యస్థాయి సెడాన్‌ సియాజ్‌ అమ్మకాలు 25 శాతం పడిపోయాయి. వినియోగ వాహనాలైన ఎర్టిగా, ఎస్‌-క్రాస్‌, విటారా బ్రెజా, విక్రయాలు 7 శాతం పెరిగి 27,081 కు చేరాయి. అయితే, ఎగుమతులు మాత్రం రెండింతలకు పైగా పెరగడం విశేషం. గత ఏడాది ఇదే నెలలో 9,586 యూనిట్లు ఎగుమతి కాగా.. ఈసారి అవి 21,321 యూనిట్లకు పెరిగింది.

ఇక మరో వాహన దిగ్గజం హ్యుందాయ్‌ టోకు అమ్మకాలు సైతం పడిపోయాయి. క్రితం ఏడాది అక్టోబరులో 68,835 యూనిట్లు అమ్ముడు కాగా.. ఈసారి అవి 43,556కు పరిమితమయ్యాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా విక్రయాలు 44,359 నుంచి 05 శాతం తగ్గి 41,908 యూనిట్లకు పడిపోయాయి. నిస్సాన్‌, స్కోడా ఆటో విక్రయాలు మాత్రం అక్టోబరు నెలలో పెరిగాయి.

కంపెనీ 2021 2020 క్షీణత/(వృద్ధి)%
మారుతీ సుజుకీ 1,38,335 1,82,448 24
నిస్సాన్‌ 3,913 1,105 (35.4)
ఎంజీ మోటార్‌ 2,863 3,750 24
స్కోడా ఆటో 3,065 1,421 (21.5)
హ్యుందాయ్‌ 43,556 68,835 37
మహీంద్రా 41,908 44,35905
ట్రాక్టర్లు2021 2020 క్షీణత/(వృద్ధి)%
ఎస్కార్ట్స్‌ 13,514 13,6641.1
ద్విచక్రవాహనాలు20212020 క్షీణత/(వృద్ధి)%
సుజుకీ మోటార్‌సైకిల్‌ 69,18676,865 10
టీవీఎస్‌ మోటార్‌ 3,55,033 3,94,724 10
వాణిజ్య వాహనాలు20212020 క్షీణత/(వృద్ధి)%
వీఈసీవీ 5,805 5,805 (38.2)
అశోక్‌ లేలాండ్‌ 11,079 9,989(11)

ఇవీ చూడండి:

Chip Shortage: వాహన విక్రయాలకు చిప్‌సెట్‌ చెక్‌

'చిప్​'తో చైనాకు భారత్ చెక్- తైవాన్​తో కలిసి మాస్టర్ ప్లాన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.