కొవిడ్ సెకండ్‌వేవ్ నుంచి మార్కెట్ కోలుకుంటున్న వేళ.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఉద్యోగ నియామకాల్లో 11 శాతం వృద్ధి కనిపించిందని ఓ సర్వే పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే నియామకాలు 11 శాతం పెరిగాయని ఇండీడ్ ఇండియా హైరింగ్ ట్రాకర్ సర్వే పేర్కొంది. ఐటీలో 61 శాతం, ఆర్థిక సేవల విభాగంలో 48 శాతం, బీపీఓ రంగాల్లో 47 శాతం వృద్ధి ఉన్నట్లు ప్రకటించింది.
2021 జూన్‌లో తొమ్మిది నగరాల్లోని 1,500 మంది ఉద్యోగులు, 1,200 వ్యాపారాలను సర్వే చేశారు. తమ జీతాలు పెరగలేదని, పదోన్నతి దక్కలేదని 70 శాతం మంది ఉద్యోగులు తెలిపారు. 51 శాతం మంది మహిళా ఉద్యోగులు, 29 శాతం మంది పురుషులు ఇంటి నుంచి పని చేయాలని కోరుకుంటున్నట్లు సర్వే తెలిపింది.
ఇవీ చదవండి: