ETV Bharat / business

డౌన్​లోడ్​లో జియో జోరు​- అప్​లోడ్​లో వొడాఫోన్ టాప్

author img

By

Published : May 13, 2021, 5:37 PM IST

ఏప్రిల్​ నెలకు గానూ 20.1 ఎంబీపీఎస్​ డౌన్​లోడ్ స్పీడ్​తో 4జీ నెట్​వర్క్ అందించి జియో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే సమయంలో అప్​లోడ్​ విషయంలో 6.7 ఎంబీపీఎస్​ స్పీడ్​​తో వొడాఫోన్ టాప్​లో ఉన్నట్లు ట్రాయ్​ తాజా నివేదికలో వెల్లడించింది.

Speediest Mobile network in India
భారత్​లో వేగవంతమైన మొబైల్ నెట్​వర్క్​

వేగవంతమైన మొబైల్ నెట్​వర్క్​గా రిలయన్స్ జియో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఏప్రిల్​ నెలకు గానూ 20.1 ఎంబీపీఎస్​ డౌన్​లోడ్​ స్పీడ్​తో 4జీ నెట్​వర్క్ అందించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్​) వెల్లడించింది.

వొడాఫోన్ 7 ఎంబీపీఎస్​ డౌన్​లోడ్ స్పీడ్​తో రెండో వేగవంతమైన టెలికాం నెట్​వర్క్​గా నిలిచింది. ఐడియా, ఎయిర్​టెల్​ డౌన్​లోడ్​ స్పీడ్​ వరుసగా 5.8 ఎంబీపీఎస్​, 5 ఎంబీపీఎస్​గా ఉన్నట్లు ట్రాయ్ వివరించింది.

అప్​లోడ్​లో ఇలా..

అప్​లోడ్ విషయంలో మాత్రం 6.7 ఎంబీపీఎస్​ స్పీడ్​​తో వొడాఫోన్ అగ్రస్థానంలో నిలిచింది. ఐడియా 6.1 ఎంబీపీఎస్​ స్పీడ్​తో రెండో స్థానంలో ఉంది.

జియో, ఎయిర్​టెల్ నెట్​వర్క్​ వరుసగా 4.2 ఎంబీపీఎస్, 3.9 ఎంబీపీఎస్​ స్పీడ్​తో 3, 4 స్థానాలతో సరిపెట్టుకున్నాయి.

మై స్పీడ్​ అప్లికేషన్​ సాయంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన డేటా ద్వారా ఈ నివేదికను రూపొందించింది ట్రాయ్.

ఇదీ చదవండి:మస్క్ యూటర్న్​- బిట్​కాయిన్​ 17% పతనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.