ETV Bharat / business

వాట్సాప్​ నుంచే జియో రీఛార్జ్.. నిత్యావసరాల కొనుగోలు కూడా! - whatsapp jio recharge

Jio Prepaid Recharge Through Whatsapp: వాట్సాప్ ద్వారా జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకునే సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఫేస్​బుక్ మాతృ సంస్థ మెటాతో జట్టుకట్టింది జియో. మరోవైపు.. వాట్సాప్ ద్వారా కిరాణా సరకులు కొనుగోలు చేసేందుకు వీలు కల్పించే జియోమార్ట్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది రిలయన్స్.

రిలయన్స్ వాట్సాప్
reliance whatsapp
author img

By

Published : Dec 15, 2021, 5:55 PM IST

Jio Prepaid Recharge Through Whatsapp: జియో వినియోగదారులు త్వరలో వాట్సాప్‌ను ఉపయోగించి మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చని టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో-మెటా(ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ) బుధవారం ప్రకటించాయి. వాట్సాప్ కమ్యూనికేషన్, చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌తో భారత్​లో మెరుగైన షాపింగ్ అనుభవాన్ని ఇస్తాయని ఇరు కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. కస్టమర్లకు వినూత్న సేవలందించేందుకు జియో-మెటా సంస్థలు పరస్పర సహకారంతో కలసి పనిచేస్తున్నట్లు జియో లిమిటెడ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ తెలిపారు.

"వాట్సాప్‌-జియో భాగస్వామ్యంతో 'ప్రీపెయిడ్ రీఛార్జ్' మరింత సులభతరం అవుతుంది. అతి త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ సేవలతో.. వినియోగదారులు అత్యంత సులభంగా రీఛార్జ్ చేసుకోగలుగుతారు"

--ఆకాశ్ అంబానీ

వాట్సాప్ ద్వారా జరిపే ఈ రీఛార్జీలన్నీ పూర్తి సురక్షితంగా.. ఎండ్-టు-ఎండ్ ఎన్​క్రిప్టెడ్​గా ఉంటాయని సంస్థ ప్రకటించింది.

2021-సెప్టెంబర్ నాటికి జియోకు 43కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 2020-­ఏప్రిల్​లో జియోలో రూ.43,574 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది మెటా.

వాట్సాప్​లో జియోమార్ట్‌ సేవలు షురూ..

Jiomart Whatsapp: దేశంలోనే అతిపెద్ద ఈ-కామర్స్‌ సంస్థగా అవతరించేందుకు ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటాతో జట్టుకట్టిన రిలయన్స్‌.. రిటైల్‌ సేవలందించే​ జియోమార్ట్‌ సేవలను వాట్సాప్​లో ప్రారంభించింది. దీనిద్వారా ఒక్క క్లిక్​తో కిరాణా సరకులు, కూరగాయలు ఇంటికి చేరుతాయని రిలయన్స్ ప్రకటించింది.

Jiomart Whatsapp Ordering: ముంబయిలో జరిగిన 'ఫ్యూయెల్ ఫర్ ఇండియా' ఈవెంట్​లో ఆకాష్ అంబానీ, ఈషా అంబానీ లైవ్​లో ఆర్డర్ ఇచ్చి లాంఛనంగా ప్రారంభించారు. దీనిలో ప్రవేశపెట్టిన నూతన 'ట్యాప్ అండ్ చాట్' ఆప్షన్ వాట్సాప్ ద్వారా కిరాణా సరకులు ఆర్డర్ చేయొచ్చని తెలిపారు. పూర్తి ఉచితంగా వస్తువులు డెలివరీ చేస్తామని.. కనీస ఆర్డర్ విలువ అంటూ ఏమీ లేదని ప్రకటించారు.

"వాట్సాప్​ను ఉపయోగించడం ఎంతో సులువు కాబట్టి కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకున్న వస్తువును ఆర్డర్ చేసుకోవచ్చు."

--ఆకాశ్ అంబానీ

వాట్సాప్​లో జియోమార్ట్ సేవలు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలకు గట్టి పోటీనిస్తాయని రిలయన్స్ భావిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.