జియో ఫోన్ వినియోగదారులకు నెలకు 300 నిమిషాల ఉచిత ఔట్‌గోయింగ్ కాల్స్‌ను అందించనున్నామని రిలయన్స్ సంస్థ శుక్రవారం ప్రకటించింది. రోజుకు 10 నిమిషాల పాటు ఉచిత టాక్‌టైమ్ లభించే విధంగా ఉన్న ఈ ఆఫర్‌ను ప్రకటించడానికి కరోనా మహమ్మారే కారణంగా తెలుస్తోంది. రీఛార్జ్ చేసుకోలేని జియో ఫోన్ వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని రిలయన్స్ తన ప్రకటనలో పేర్కొంది.
కరోనా రెండో దశ నేపథ్యంలో ఫ్రీ టాక్‌టైమ్ ప్రకటించిన తొలి సంస్థగా రిలయన్స్ జియో నిలిచింది.
ఫ్రీ టాక్‌టైమ్‌తో పాటు జియో మరో ఆఫర్‌ను ప్రకటించింది. వినియోగదారుడు రీఛార్జ్ చేసుకునే ఏ జియోఫోన్ ప్లాన్‌కు అయినా అంతే విలువ చేసే రీఛార్జ్ ప్లాన్ ఉచితంగా లభిస్తుందని పేర్కొంది. మహమ్మారి తగ్గుముఖం పట్టేవరకు ఈ ఆఫర్లు కొనసాగుతాయని.. అయితే ఈ ఆఫర్లు వార్షిక ప్లాన్లు, జియోఫోన్ డివైస్ బండల్డ్ ప్లాన్స్‌కు వర్తించవని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : స్పుత్నిక్ వి టీకా ధర రూ.995.40