ETV Bharat / business

రిలయన్స్​ జియోకు తగ్గారు​- ఎయిర్​టెల్​కు పెరిగారు! - ఏయిర్​టెల్​ మొబైల్​​ సబ్​స్క్రైబర్లు

సెప్టెంబరు నెలలో జియో సంస్థ(reliance jio) 1.9 కోట్ల మంది​ యూజర్లను కోల్పోయినట్లు ట్రాయ్​ వెల్లడించింది. అదే నెలలో పోటీదారైన ఎయిర్​టెల్​కు 2.74 లక్షల మంది కొత్త యూజర్లు పెరగగా.. ఐడియా 10.7 లక్షల సబ్​స్క్రైబర్స్​ను కోల్పోయినట్లు పేర్కొంది.

Jio loses 1.9 cr wireless subscribers
రిలయన్స్​ జియోకు షాక్
author img

By

Published : Nov 23, 2021, 11:49 AM IST

Updated : Nov 23, 2021, 2:55 PM IST

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోకు వినియోగదారులు సెప్టెంబరు నెలలో 1.9 కోట్ల వైర్​లెస్​ సబ్​స్ర్కైబర్లు తగ్గినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా (ట్రాయ్​) వెల్లడించింది. దీంతో ఆ నెలలో 4.29 శాతం యూజర్​బేస్​ను కోల్పోయి.. మొబైల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 42.48 కోట్లకు(reliance jio total subscriber) చేరింది.

అదే నెలలో ప్రత్యర్థి ఎయిర్​టెల్​కు కొత్తగా 2.74 లక్షల మంది కొత్త యూజర్లు పెరిగినట్లు ట్రాయ్​ పేర్కొంది. దీంతో ఆగస్టు​నెలలో 35.41 కోట్ల మంది ఉన్న యూజర్ల సంఖ్య సెప్టెంబరులో 35.44 కోట్లకు పెరిగింది. ఫలితంగా 0.08 శాతం కొత్త యూజర్‌బేస్‌ను సొంతం చేసుకుంది.

అయితే మరో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా సెప్టెంబరు నెలలో 10.7 లక్షల మంది సబ్​స్క్రైబర్లను కోల్పోయింది. ఫలితంగా యూజర్​బేస్ 26.99 కోట్లకు తగ్గిపోయింది.

దేశంలో మొత్తం టెలిఫోన్​ సబ్​స్క్రైబర్లు(telecom subscribers in India) కూడా తగ్గినట్లు ట్రాయ్​ తెలిపింది. ఆగస్టులో 118 కోట్లు ఉన్న సబ్​స్కైబర్లు సెప్టెంబరు నెలాఖరు నాటికి 116 కోట్లకు తగ్గినట్లు వెల్లడించింది.

ఎయిర్​టెల్(airtel recharge)..​ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచుతునున్నట్లు ప్రకటించింది. అన్ని ప్లాన్​ల​పై 20-25 శాతం ధరలు పెంచినట్లు పేర్కొంది. కొత్త రీఛార్జ్​ ధరలు నవంబరు 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. పూర్తికథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ఇదీ చూడండి: అమెజాన్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ వివాదానికి త్వరలోనే చెక్​!

Last Updated : Nov 23, 2021, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.