ETV Bharat / business

జియో నుంచి మళ్లీ ధన్​ ధనా ధన్​ ఆఫర్లు - జియో ధన్​ధనా ధన్ ఆఫర్లు ఇవే

ఐపీఎల్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. క్రికెట్ ప్రియులను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్​లను ప్రకటించింది రిలయన్స్ జియో. ఐపీఎల్ క్రికెట్​​ లైవ్​ ప్రసారం చేసే డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో ​కూడిన ఆఫర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఆఫర్ల ధరలు, వ్యాలిడిటీ వివరాలు ఇలా ఉన్నాయి.

Jio launches special offers for IPL fans
జియో యూజర్లకు అదిరే ఐపీఎల్​ ఆఫర్లు
author img

By

Published : Aug 25, 2020, 6:53 PM IST

త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్‌ సీజన్‌కు ప్రముఖ టెలికాం సంస్థ జియో భారీ ఆఫర్లతో సిద్ధమైంది. క్రికెట్‌ ప్రియులకు వినోదాన్ని పంచేందుకు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. లైవ్‌ మ్యాచ్‌లు ప్రసారం చేసే డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన నాలుగు ప్లాన్లను తాజాగా విడుదల చేసింది.

ఈ ప్లాన్ల ధరలను రూ.401, రూ.499, రూ.777, రూ.2,599గా నిర్ణయించింది.

ఆఫర్ల వివరాలు..

  • రూ.401 ప్లాన్‌ కింద యూజర్లకు ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ సేవలు ఉచితంగా లభించనున్నాయి. నెలరోజుల వ్యాలిడిటీతో 90 జీబీ డేటా అందిస్తున్నారు. దీనితో పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం కూడా ఇస్తున్నారు.
  • రూ.499 ప్లాన్‌ కింద డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో 84 జీబీ డేటా లభిస్తుంది. 2 నెలల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌లో ఎలాంటి కాల్స్‌ లభించవు.
  • రూ.777 ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌, 3 నెలల వ్యాలిడిటీ, 131 జీబీ డేటా, ఉచిత కాల్స్‌ లభిస్తాయి.
  • ఏడాది కాలపరిమితి కలిగిన రూ.2,599 ప్లాన్‌ కింద డిస్నీ+హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 740 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకునే వీలుంది.
    jio offers
    జియో ఆఫర్లు

ఇదీ చూడండి:'భారీ సంస్కరణలతోనే ఆర్థిక రికవరీ సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.