ETV Bharat / business

Jio: జియో సరికొత్త ఆఫర్‌.. 'ఎమర్జెన్సీ' డేటా లోన్‌ - జియో ఎమర్జెన్సీ డేటా లోన్‌

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో(JIO).. సరికొత్త ఆఫర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ డేటా లోన్‌ పేరిట తన వినియోగదారులు ముందస్తు చెల్లింపు లేకుండా రీఛార్జ్‌ చేసుకునే వెసులుబాటును కల్పించనుంది. ప్రిపెయిడ్‌ వినియోగదారుడికి ఐదు ప్యాక్‌లుగా ఈ ఎమర్జెన్సీ డేటా లోన్‌ అందివ్వనుంది.

Jio launches emergency data loan facility, check details
జియో సరికొత్త ఆఫర్‌.. ఎమర్జెన్సీ డేటా లోన్‌!
author img

By

Published : Jul 3, 2021, 3:51 PM IST

Updated : Jul 3, 2021, 6:55 PM IST

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి చెందిన జియో సంస్థ(JIO) మరో సరికొత్త ఆఫర్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ డేటా లోన్‌ పేరిట కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చిన జియో సంస్థ.. దీని ద్వారా ముందస్తు చెల్లింపు లేకుండా రీఛార్జ్‌ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ సరికొత్త ఆఫర్‌.. మై జియో యాప్‌ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది.

'వారికోసమే..'

దీని ప్రకారం ఒక్కో జియో ప్రిపెయిడ్‌ వినియోగదారుడికి ఐదు ప్యాక్‌లుగా.. ఎమర్జెన్సీ డేటా లోన్‌ను తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఒక్కో ప్యాక్‌లో.. 1 జీబీ డేటాను రూ.11కు అందించనుంది. రోజువారీ డేటా కోటా పూర్తైన సందర్భంలో వెంటనే రీఛార్జ్‌ చేయలేక ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు రిఛార్జ్‌ నౌ- పే లేటర్‌.. ఈ ఆఫర్‌ ఉపయోగ పడనుందని ఆ సంస్థ పేర్కొంది.

ఇవీ చదవండి:

ఎయిర్​టెల్​కే అధికంగా కొత్త యూజర్లు!

మొబైల్‌+ డీటీహెచ్‌+ ఫైబర్‌.. ఒకే ప్లాన్‌లో అన్నీ!

Last Updated : Jul 3, 2021, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.