కరోనా వేగంగా విస్తరిస్తున్న వేళ టెలికాం సంచలనం జియో మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది. కొత్త వినియోగదారులకు ఉచిత బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కనెక్షన్ తీసుకున్న కస్టమర్లకు రెట్టింపు డేటా సౌలభ్యం కల్పించనున్నట్లు వెల్లడించింది. కరోనా ప్రభావంతో ఇంటి నుంచి పనిచేస్తున్న వారికి మద్దతుగా ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు జియో పేర్కొంది. భౌగోళిక సాధ్యాసాధ్యాలకు లోబడి ఉచిత సేవలు అందించనున్నట్లు స్పష్టం చేసింది.
"ఇంట్లో ఉన్నప్పుడు అందరూ తమ సంబంధాలను కొనసాగించేలా బేసిక్ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను(10 ఎంబీపీఎస్ వరకు) జియో ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా ఈ(కరోనా వైరస్) కాలవ్యవధిలో అందిస్తుంది. హోమ్ గేట్‌వే రూటర్లను సైతం అతి తక్కువ డిపాజిట్‌తో(రీఫండబుల్) జియో అందిస్తుంది."
-జియో సంస్థ
జియో ఫైబర్ కనెక్షన్ కోసం ఇన్స్టాలేషన్ సమయంలో కస్టమర్లు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.1,500 కనెక్షన్ రద్దు చేసుకున్నప్పుడు తిరిగి చెల్లిస్తారు.
ఇప్పటికే 4జీ డేటా ఓచర్లతో రెట్టింపు డేటా ఆఫర్‌ను ప్రకటించింది జియో. ప్రస్తుత పరిస్థితుల్లో... అన్ని సమయాల్లో సేవలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉచిత బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు, అదనపు డేటా అందిస్తున్నట్లు వారం క్రితమే ప్రకటించాయి.
ఇదీ చదవండి: త్వరలో ఉద్దీపన పథకం ప్రకటించనున్న కేంద్రం