Jio 5G: దేశంలోని వెయ్యి ప్రధాన నగరాల్లో పైలట్ ప్రాజెక్టు కింద 5G నెట్‌వర్క్‌ను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రకటించింది. ఎంపిక చేసిన నగరాల్లో ఫైబర్ సామర్థ్యాన్ని పెంచడమే గాక పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు తెలిపింది. దేశంలో 5G విస్తరణ కోసం ప్రత్యేక బృందాలను తయారు చేసినట్లు జియో ప్రతినిధి ఒకరు తెలిపారు. 5G నెట్‌వర్క్ ప్రత్యేకమైనదని.. అందుకోసం 3D మ్యాప్ వంటి అధునాతన పద్ధతులు అవలంబిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆరోగ్యం, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రంగాల్లో 5G నెట్‌వర్క్ ట్రయల్స్ చేస్తున్నట్లు జియో తెలిపింది. అనుమతులు రాగానే నెట్‌వర్క్ విస్తరణ పనులు మొదలుపెట్టనున్నట్లు వెల్లడించింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: విద్యుత్ వాహన విభాగంలోకి అదానీ.. బస్సులు, ట్రక్కుల తయారీ!