ETV Bharat / business

నేడు అక్షయ తృతీయ - పసిడి కొనుగోళ్లు ఎలా?

నేడు అక్షయ తృతీయ. ప్రతి ఏటా అక్షయ తృతీయ నాడు దేశ ప్రజలు భారీగా పసిడి కొనుగోళ్లు జరుపుతారు. అయితే ఈసారి కరోనా కారణంగా అందుకు అవకాశం లేకుండా పోయింది. లాక్​డౌన్ వేళ కొన్ని సంస్థలు ఆన్​లైన్​లో పసిడి విక్రయాలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్​లైన్ కొనుగోళ్లపై ప్రజల అభిప్రాయలేంటి? ఈ సారి అమ్మకాలపై విశ్లేషకులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

today Akshay Tritiya
నేడే అక్షయ తృతీయ
author img

By

Published : Apr 26, 2020, 2:07 PM IST

భారతీయ సంప్రదాయాల్లో అక్షయ తృతీయకు ప్రత్యేకత ఉంది. అందుకే అక్షయ తృతీయ నాడు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అలా చేస్తే మంచి జరుగుతుందనేది వారి నమ్మకం. అయితే కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్​డౌన్ కొనసాగుతోంది. ఈ కారణంగా కొనుగోలుదారులు అక్షయ తృతీయ నాడు పసిడి నేరుగా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి.

లాక్​డౌన్​ నేపథ్యంలో కొన్ని జువెలరీ సంస్థలు ఆన్​లైన్​లో పసిడి విక్ర‌యించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి. అయితే ఆన్‌లైన్‌లో కొనుగోళ్ల‌పై అంతగా న‌మ్మ‌కం లేద‌ని అంటున్నారు కొనుగోలుదారులు. ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న‌దని అభిప్రాయ‌ప‌డుతున్నారు. డెలీవ‌రీ విధానం ఎలా ఉంటుందోన‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. స్థానిక దుకాణాల్లో కంటే ఆన్‌లైన్‌లో కొంటే అధిక ఛార్జీలు వ‌ర్తిస్తాయ‌ని అంటున్నారు.

డిమాండ్​ లేమి..

ప్ర‌తి ఏడాది అక్ష‌య తృతీయ నేప‌థ్యంలో 20 నుంచి 25 ట‌న్నుల బంగారం అమ్మ‌కాలు జ‌రుగుతాయి. ఇది దేశం మొత్తం వార్షిక అమ్మ‌కాల‌లో 4 శాతం. కానీ ఈ ఏడాది అమ్మ‌కాలు అంత‌గా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని 'ఇక్రా' రేటింగ్ ఏజెన్సీస్ అంచ‌నా వేసింది. ఇప్పుడు నిత్యావ‌సరాలు త‌ప్పా వేరే వస్తువుల డెలివ‌రీకి ప్ర‌భుత్వ అనుమ‌తి లేక‌పోవ‌డం కూడా ఒక కార‌ణం.

అక్ష‌య‌ తృతీయ సమ‌యంలో లాక్‌డౌన్ ఉండ‌టం గోల్డ్ రిటైల‌ర్ల‌కు ప్ర‌తికూల‌మ‌నే చెప్పాలి.

ఆన్​లైన్​ సవాళ్లు..

ఆన్‌లైన్ అమ్మకాలకు అనేక సవాళ్లు ఉన్నాయి. దేశంలో బంగారు కొనుగోలుదారుల్లో ఎక్కువమంది గ్రామీణ ప్రజలే. ఇందులో చాలా మంది విశ్వసనీయమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, బ్యాంకింగ్ సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారూ.. బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందు నేరుగా చూడటానికి ఇష్టపడతారని విశ్లేషకులు అంటున్నారు.

ధరల పెరుగదల..

ఇప్ప‌టికే బంగారం ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డం వల్ల కొనుగోళ్లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. దీనితో పాటు ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఎదురైంది. ఆన్‌లైన్ జువెల‌రీ సంస్థ‌లు ఆఫ‌ర్లు ఇస్తున్నప్ప‌టికీ ఎక్కువ గ్రామీణ ప్రాంతాలే బంగారం కొనుగోళ్లలో ప్ర‌ధాన భాగం ఉంటుంది. కానీ వారు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయ‌క‌పోవ‌చ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లాక్‌డౌన్ కార‌ణంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బంగారం కొన‌గోళ్లు సాధ్యమేనా అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అయితే సాంప్ర‌దాయాన్ని కొన‌సాగించేందుకు చాలావ‌ర‌కు త‌మ వినియెగ‌దారులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నార‌ని దేశ ఆతిపెద్ద జువెల‌రీ 'టైటాన్' తెలిపింది.

ప్ర‌స్తుతం నిత్యావ‌స‌రాలు త‌ప్పా ఇత‌ర వ‌స్తువుల డెలివ‌రీకి అనుమ‌తి లేదు. అయితే ఇప్పుడు కొనుగోలు చేస్తే లాక్‌డౌన్ త‌ర్వాత డెలివ‌రీ చేస్తామ‌ని జువెల‌రీ సంస్థ‌లు చెప్తున్నాయి.

ఇదీ చూడండి:మిస్టర్‌ ఫ్రాంక్లిన్‌కు ఏమైంది? రూ.31,000 కోట్లు ఏమైనట్టు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.