ఇప్పటి వరకు నిలిచిపోయిన జెట్ ఎయిర్వేస్ విమానాల సంఖ్య 54కు చేరింది.
సర్వీసుల రద్దుతో పాటు అంతర్జాతీయ ట్రిప్‌లను తగ్గించినట్లు జెట్ ఎయిర్వేస్ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా దిల్లీ, ముంబయి నుంచి ట్రిప్‌ల సంఖ్య అధికంగా తగ్గించినట్లు సంస్థ తెలిపింది.
ఒకప్పుడు రోజుకు 600 విమానాలు నడిపిన జెట్ఎయిర్ వేస్... ఆర్థిక సంక్షోభం వల్ల ప్రస్తుతం రోజుకు 119 విమానాలు మాత్రమే నడుపుతోంది.