ETV Bharat / business

బెజోస్​కు ఆఖరి రోజు.. కొత్త సీఈఓ ఆండీ జాస్సీ

జెఫ్​ బెజోస్(Jeff Bezos)​.. ప్రపంచ సంపన్నుల గురించి ఏదైన చర్చ వస్తే అందులో ముందుగా ఉండేది ఈయన పేరే అనడంలో సందేహం లేదు. ఈ కామర్స్​ సంస్థ అమెజాన్​ను స్థాపించి ఆయన ఈ స్థాయికి చేరారు. సంస్థ సీఈఓగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ పదవి నుంచి తప్పుకుని రిటైర్​ అవుతున్నారు. కొత్త సీఈఓగా ఆండీ జాస్సీ(Andy Jassy) బాధ్యతలు స్వీకరించనున్నారు.

Jeff bezos
జెఫ్​ బెజోస్​ జీవిత విశేషాలు
author img

By

Published : Jul 5, 2021, 1:01 PM IST

Updated : Jul 5, 2021, 2:53 PM IST

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు(Amazon founder), సీఈఓ జెఫ్​ బెజోస్(Jeff Bezos) రిటైర్​మెంట్​కు సిద్ధమయ్యారు. సీఈఓ పదవి నుంచి సోమవారమే (జులై 5) ఆయన తప్పుకోనున్నారు. 57 ఏళ్ల వయస్సులో రిటైర్ అవుతున్న జెఫ్​ బెజోస్​ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం.

  • 1965 జనవరి 12న న్యూ మెక్సికోలో జన్మించారు జెఫ్​ బెజోస్​.
    Bezos with his mother
    బెజోస్ చిన్నప్పుడు ఆయన తల్లితో
  • ప్రిన్స్​టన్న్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్, కంప్యూటర్​ సైన్స్​ నుంచి పట్టా పొందారు.
  • చదువు పూర్తయిన తర్వాత ఇంటెల్​, బెల్​ ల్యాబ్స్​ సహా పలు ఇతర సంస్థల్లో పని చేశారు.
  • ఆయనకు 30 ఏళ్ల వయస్సున్నప్పుడు ఇంటర్నెట్​ బూమ్​ చూసి.. తాను పని చేస్తున్న సంస్థకు రాజీనామా చేశారు. సొంతంగా కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నారు.
  • ఆ ఆలోచనతోనే 1994 జులై 5న అమెజాన్ ప్రారంభమైంది. తొలినాళ్లలో సెకండ్​ హ్యాండ్​ బుక్స్ అమ్మె సంస్థగా అమెజాన్ సేవలందించింది. కొన్నాళ్లకే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు కార్యకలాపాలను విస్తరించింది. ఇప్పుడు అమెజాన్​లో దొరకని వస్తువంటూ లేదనే స్థాయికి ఎదిగింది.
  • బ్లూమ్​బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్​ ప్రకారం బెజోస్​ దాదాపు 199 బిలియన్​ డాలర్ల సంపదతో రిటైర్​ అవుతున్నారు.
  • ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంపన్నుడు కూడా జెఫ్​ బెజోసే కావడం విశేషం. పలు దేశాల జీడీపీ కన్నా జెఫ్​ బెజోస్​ సంపదే ఎక్కువ కావడం గమనార్హం.
  • అమెజాన్ సీఈఓ బాధ్యతలకు గాను జెఫ్​ బెజోస్​ గత ఏడాది 81,840 డాలర్ల వేతనాన్ని, 1.6 మిలియన్ల డాలర్ల పారితోషికాన్ని అందుకున్నారు.
  • 65 ఏళ్లు దాటిన సగటు అమెరికన్​తో పోలిస్తే.. జెఫ్​ బెజోస్ సంపద 739,489 రెట్లు ఎక్కువ.
  • రిటైర్​మెంట్ సమయానికి సగటు అమెరికన్ సంపద 266,400 డాలర్లుగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.
  • ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం కుదిపేసినా.. 2020లో బెజోస్​ సంపద 75 బిలియన్ డాలర్లు పెరిగింది.
  • అమెరికాలోని సగటు కార్మికులు వారంలో సంపాదించే మొత్తంతో పోలిస్తే.. బెజోస్​ ఒక సెకనులో సంపదించే మొత్తమే ఎక్కువ.
  • బెజోస్​ సంపదే కాదు.. పలు ఇతర విషయాల్లోనూ రికార్డు సృష్టించారు. ముఖ్యంగా భార్య మెకాంజీ స్కాట్​తో 2019లో విడాకులు తీసుకోగా.. అందుకు 38 బిలియన్​ డాలర్ల భరణం చెల్లించారు బెజోస్​.
    Bezos with MacKenzie Scott
    మాజీ భార్య మెకాంజీతో బెజోస్​
  • రిటైర్మెంట్ తర్వాత బెజోస్​ క్రేజీ లైఫ్​ స్టైల్​ను అనుసరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే నెలలో ఆయనకు చెందిన బ్లూ ఆరిజిన్ వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణించనున్నారు.
    Bezos with Blue moon
    బ్లూ ఆరిజిన్ అంతరిక్ష​ నౌకతో బెజోస్​
  • వీటన్నింటితో పాటు.. కార్మికులకు సరైన వసతులు కల్పించడం లేదని, ఆదాయపు పన్ను చెల్లించలేదని, లాబీయింగ్ కోసం ఎక్కువగా ఖర్చులు చేస్తున్నట్లు బెజోస్​పై విమర్శలు కూడా ఉన్నాయి.

సీఈఓగా వైదొలగినా...

జెఫ్‌ బెజోస్ సీఈఓ పదవి నుంచి వైదొలగిన తర్వాత.. ఆ బాధ్యతల్ని సన్నిహితుడు ఆండీ జాస్సీకి(Andy Jassy) అప్పగించనున్నారు. అయితే, అమెజాన్‌ నుంచి మాత్రం బెజోస్​ పూర్తిగా తప్పుకోవడం లేదు. ఎగ్జిక్యూటివ్‌ బోర్డుకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఆండీ జాస్సీ ప్రస్తుతం అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ అధిపతిగా ఉన్నారు. ఈయన 1997 నుంచే అమెజాన్​లో పని చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 5, 2021, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.