ITR verification: 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నులను ఇ-వెరిఫై చేయని పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను శాఖ మరో అవకాశం కల్పించింది. ఇ-వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు గడువును 2022 ఫిబ్రవరి 28వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
E filing of ITR: డిజిటల్ సంతకం లేకుండా... ఆన్లైన్లో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు.. కచ్చితంగా దాన్ని 120 రోజుల్లోగా ఇ-వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆధార్ ఓటీపీ, నెట్-బ్యాంకింగ్, డీమ్యాట్ అకౌంట్‌కు పంపిన కోడ్, ప్రివ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్, ఏటీఎం వంటి వాటిని ఉపయోగించవచ్చు. అంతేగాకుండా... పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్నుల ఫిజికల్ కాపీని సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్(సీపీసీ) బెంగళూరుకు పంపించి కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
ITR v form: ఐటీఆర్-V ఫారం ద్వారా ఈ ఇ-వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. లేనట్లయితే.. ఐటీఆర్‌ను దాఖలు చేయనట్లుగా పరిగణిస్తామని చెప్పింది. 2020-21 కోసం ఆన్లైన్లో దాఖలు చేసిన ఐటీఆర్‌లకు సంబంధించి ధ్రువీకృత వీ-ఫామ్ లేనందున చాలా సంఖ్యలో ఐటీఆర్‌లు తమ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని... వీటన్నింటినీ ఫిబ్రవరి 28లోపు ఇ-వెరిఫై పూర్తి చేయాలని చెప్పింది. ఈ మేరకు డిసెంబరు 28న జారీ చేసిన ఉత్తర్వులో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది.
ఐటీ రిటర్నులు దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు కూడా... ఇ-వెరిఫికేషన్ ప్రకియ పూర్తి చేసేందుకు నిర్ణీత గడువు దొరుకుతుందని ఏంఆర్ఎంజీ & అసోసియేట్ సీనియర్ పార్ట్నర్ రాజత్ మోహన్ తెలిపారు. అయితే... సెక్షన్ 244ఏ ప్రకారం వారికి వడ్డీ పరిహారం లభించదని చెప్పారు.
4.86 కోట్లకుపైగా ఐటీఆర్‌లు...
Fy21 itr filing: 2020-21ఆర్థిక సంవత్సరానికి... ఇప్పటివరకు 4.86కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. మంగళవారం ఒక్కరోజే.... 18.89 లక్షలకుపైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని చెప్పింది.
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుకు డిసెంబరు 31 తుది గడువు.
ఇదీ చూడండి: Taxpayer Complaints: ఐటీ రిటర్న్‌ల గడువు పెంచండి..!
ఇదీ చూడండి: Home Loan EMI: హోం లోన్ ఈఎంఐ చెల్లించకపోతే ఏమవుతుంది?