ETV Bharat / business

టాటా ట్రస్టులకు ​పన్ను మినహాయింపును సమర్థించిన ఐఈఏటీ - tata trusts tax exemption news

టాటాగ్రూప్ ట్రస్టులకు ఊరట లభించింది. రతన్​ టాటా ట్రస్టు, జేఆర్​డీ టాటా ట్రస్టు, దోరాబ్జి టాటా ట్రస్టులకు పన్ను మినహాయింపును ఐటీఏటీ సమర్థించింది. ఈ మూడు ట్రస్టులకు పన్న మినహాయింపును రద్దు చేస్తూ ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన ఆదేశాలను కొట్టివేసింది.

ITAT upholds Tata's tax-exempt status; censures Mistry
టాటా ట్రస్టులకు ​పన్ను మినాయింపును సమర్థించిన ఐఈఏటీ
author img

By

Published : Dec 29, 2020, 9:04 PM IST

టాటా గ్రూప్​కు చెందిన రతన్​ టాటా, జేఆర్​డీ టాటా, దోరాబ్జీ టాటా ట్రస్టులకు పన్ను మినహాయింపును 'ది ఇన్​కం ట్యాక్స్​ అప్పీలేట్​ ట్రైబ్యునల్(ఐటీఏటీ)'​ సమర్థించింది. ఈ మూడు ట్రస్టులు టాటా సన్స్​ షేర్లు కలిగి ఉన్నాయనే కారణంతో పన్ను మినహాయింపు రద్దు చేస్తూ ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఐటీఏటీ అధ్యక్షుడు జస్టిస్​ ఆర్పీ భట్​, ఉపాధ్యక్షుడు ప్రమోద్ కుమార్​ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు డిసెంబర్ 28న మూడు వేర్వేరు ఆదేశాలు జారీ చేసింది.

మూడు ట్రస్టులు టాటా సన్స్​లో వాటాలు కలిగి ఉండి పన్ను మినహాయింపు పొందడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ 2019 మేలో ఆదాయపన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి పన్ను మినహాయింపు రద్దు చేస్తామని పేర్కొంది. దీనిపై ఐటీఏటీని ఆశ్రయించిన టాటా గ్రూప్​నకు ఊరట లభించింది. పన్ను మినహాయింపు రద్ధు చేయాలనే ఐటీ శాఖ నిర్ణయానికి చట్టబద్ధంగా స్థిరమైన యోగ్యత లేదని ఐటీఏటీ స్పష్టం చేసింది.

టాటా సన్స్​ ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన తర్వాత వారం రోజుల గడవక ముందే అనధికారికంగా ఆదాయపన్ను శాఖకు పత్రాల సమర్పించిన సైరస్​ మిస్త్రీ చర్యలను ఐటీఏటీ తీవ్రంగా తప్పుబట్టింది. కార్పొరేట్​ ప్రపంచంలోనే ఎన్నడూ వినని విధంగా మిస్త్రీ ప్రవర్తించారని వ్యాఖ్యానించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.