ETV Bharat / business

కేజీ-డి6లో 75శాతం గ్యాస్‌ రిలయన్స్‌ చేతికి! - kg-d6 basin stakeholders

కేజీ-డి6 బ్లాక్‌లోని గ్యాస్‌లో నాలుగింట మూడో వంతును (75%) రిలయన్స్​ సహ దాని అనుబంధ కంపెనీలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దిగుమతి రేటుతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ప్రస్తుత ధర సగం కంటే తక్కువగా ఉండడమే ఇందుకు కారణం.

Krishnagodavari basin
కేజీ-డి6లో 75% గ్యాస్‌ రిలయన్స్‌ చేతికి!
author img

By

Published : May 11, 2021, 7:53 AM IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఆ సంస్థ అనుబంధ కంపెనీలు కలిసి సంస్థకు చెందిన తూర్పు ఆఫ్‌షోర్‌ కేజీ-డి6 బ్లాక్‌లోని కొత్త గ్యాస్‌లో నాలుగింట మూడో వంతును (75%) కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దిగుమతి రేటుతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ప్రస్తుత ధర సగం కంటే తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. గత వారం రిలయన్స్‌ తన భాగస్వామి బీపీ పీఎల్‌సీతో కలిసి రోజుకు 5.5 మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను వేలానికి ఉంచింది. అందులో 3.2 ఎమ్‌ఎమ్‌ఎస్‌సీఎమ్‌డీ గ్యాస్‌ను రిలయన్స్‌ ఓ2సీ వ్యాపారం కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

రిలయన్స్‌, బీపీల సంయుక్త సంస్థ ఇండియా గ్యాస్‌ సొల్యూషన్స్‌ 1 ఎమ్‌ఎమ్‌ఎస్‌సీఎమ్‌డీని సొంతం చేసుకుందని పేర్కొన్నాయి. మిగతా గ్యాస్‌ను అదానీ గ్యాస్‌, ఐఆర్‌ఎమ్‌ ఎనర్జీ, గెయిల్‌, టొరెంట్‌ గ్యాస్‌లు సొంతం చేసుకున్నాయని తెలుస్తోంది. ఇ-వేలంలో ధర జేకేఎమ్‌ ఎల్‌ఎన్‌జీ ధరతో పోలిస్తే 0.06 డాలర్లు తక్కువగా ఉందని.. ప్రస్తుత ధర వద్ద అది ఒక్కో ఎమ్‌ఎమ్‌బీటీయూకు 8-9 డాలర్లకు సమానమని.. అయితే ఇందులో సగం కంటే తక్కువ రేటుకే కొనుగోలుదార్లు సొంతం చేసుకున్నారని ఆ వర్గాలు తెలిపాయి.

ఏప్రిల్‌ 1, 2021 నుంచి సెప్టెంబరు 30, 2021 వరకు గ్యాస్‌ గరిష్ఠ ధరను ఒక్కో ఎమ్‌ఎమ్‌బీటీయూకు 3.62 డాలర్లుగా ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు నేపథ్యం. ఇంత తక్కువ ధరకు విక్రయిస్తే కొనుగోలుదార్లకు ఎక్కువ ప్రయోజనాలు; ఉత్పత్తిదారుకు తక్కువ ప్రయోజనాలు అందుతాయని.. అదీకాక ప్రభుత్వం కూడా మిలియన్‌ డాలర్లలో తక్కువ రాయల్టీ, పన్నులను కోల్పోతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ పరిణామాలపై రిలయన్స్‌, బీపీలు స్పందించలేదు.

ఇదీ చూడండి: ఫార్మా విక్రయాల్లో గ్లెన్​మార్క్​​​ 'ఫాబిఫ్లూ' రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.