ఈనెల 25 నుంచి దేశీయంగా విమాన సర్వీసులు ప్రారంభమైనా, జూన్ 1 నుంచి 200 రైళ్లు నడవబోతున్నా.. రాబోయే నెలరోజుల్లో ప్రయాణానికి సిద్ధంగా లేమని 76 శాతం మంది చెబుతున్నారని లోకల్‌సర్కిల్స్ అనే సంస్థ చెబుతోంది. దేశంలో రోజూ 7,000 కరోనా కొత్త కేసులు నమోదవుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. ఇప్పుడు ప్రయాణిస్తున్న వారిలో అత్యధికంగా లాక్‌డౌన్ వల్ల వేరే ప్రాంతాల్లో 2 నెలలుగా చిక్కుకుపోయిన వారేనని వివరించింది.
దేశంలోని 212 జిల్లాల్లో 16,000 మంది నుంచి సమీకరించిన వివరాలతో ఈ సంస్థ నివేదిక రూపొందించింది. ఇందులో 71 శాతం మంది పురుషులు, 29 శాతం మంది మహిళలు ఉన్నారు. నగరాల నుంచి 49శాతం మంది, రెండో అంచె పట్టణాల నుంచి 34 శాతం మంది, 3-4 అంచె పట్టణాల నుంచి 17 శాతం మంది తమ మనోభిప్రాయం తెలిపారు. ఈ ప్రకారం..
- విమాన టికెట్లు బుక్ చేసుకున్నామని, అతిత్వరలో ప్రయాణిస్తామని చెప్పినవారు.. 10 శాతం మంది
- త్వరలో టికెట్లు బుక్ చేసుకుంటామని తెలిపిన వారు.. 11 శాతం మంది
- రైళ్లలో ప్రయాణానికి ఎటువంటి ప్రణాళిక లేని వారు.. 88 శాతం మంది
- టికెట్లు కొనుగోలు చేశాం, ప్రయాణిస్తాం అన్నవారు.. 4 శాతం మంది
- త్వరలో టికెట్లు బుక్ చేస్తాం అన్నవారు.. 6 శాతం మంది
ఇదీ చూడండి... చైనా స్థాయిలో భారత్‌లో ఇంధన గిరాకీ పెరిగేది ఎప్పుడు?