పన్ను చెల్లింపు దారులకు మరింత చేరుయ్యేందుకు కొత్త ఈ-ఫైలింగ్ వెబ్ పోర్టల్‌ను తీసుకొస్తోంది ఆదాయపన్ను శాఖ. దీన్ని జూన్ 7న ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ పోర్టల్ ద్వారా సాధారణ ఐటీఆర్ దాఖలు సహా ఇతర పన్ను సంబంధిత పనులు చేసుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వెబ్ పోర్టల్ జూన్ 1 నుంచి 6 వరకు ఆరు రోజుల పాటు పని చేయదని స్పష్టం చేసింది. కొత్త పోర్టల్ వినియోగదారులకు మరింత సులభంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఆదాయ పన్ను శాఖలోని సిస్టమ్స్ విభాగం ఈ అంశంపై ఆదేశాలు ఇచ్చింది. పాత పోర్టల్ www.incometaxindiaefiling.gov.in నుంచి కొత్త పోర్టల్ www.incometaxgov.in కు మార్పు త్వరలోనే పూర్తవుతుందని, జూన్ 7వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
"కొత్త పోర్టల్ ప్రారంభించే ప్రక్రియలో బాగంగా పాత పోర్టల్ జూన్ 1 నుంచి 6 వరకు అందుబాటులో ఉండదు. పన్ను చెల్లింపుదారులతో పాటు ఆదాయపన్ను విభాగం అధికారులు సైతం పాత పోర్టల్‌ను యాక్సెస్ చేయలేరు. ఈ సమయంలో టాక్స్‌పేయర్స్, అధికారుల మధ్య ఏదైన పని ఉంటే అది ముందే ముగించటం లేదా వాయిదా వేయటం జరుగుతుంది."
-సిస్టమ్స్ విభాగం, ఐటీ శాఖ
ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా వ్యక్తిగత, వ్యాపార ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయవచ్చు. రిఫండ్స్ గురించి ఫిర్యాదులు చేయవచ్చు. అలాగే.. ఐటీ శాఖతో ఇతర పనులేమైనా ఉన్నా చేసుకోవచ్చు.
ఇదీ చూడండి: ఐటీ ఈ-ఫైలింగ్ ఖాతా హ్యాక్ అయిందా?