ETV Bharat / business

వీటికి అలోపతిలో శాశ్వత చికిత్స ఉందా? - బీపీ, మధుమేహానికి అలోపతిలో ఎందుకు శాశ్వత చికిత్స ఉందా

అలోపతిలో శాశ్వత చికిత్స ఎందుకు లేదంటూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)కు యోగా గురు బాబా రాందేవ్‌ 25 ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ట్విటర్‌లో బహిరంగ లేఖ రాశారు.

Yoga Guru Baba Randev‌
యోగా గురు బాబా రాందేవ్‌
author img

By

Published : May 25, 2021, 6:24 AM IST

అలోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో వాటిని ఉపసంహరించుకున్న యోగా గురు బాబా రాందేవ్‌ సోమవారం మళ్లీ సరికొత్త వాదనలతో ముందుకొచ్చారు. కొన్నింటికి అలోపతిలో శాశ్వత చికిత్స ఎందుకు లేదంటూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)కు 25 ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ట్విటర్‌లో బహిరంగ లేఖ రాశారు.

  • బీపీ, మధుమేహానికి అలోపతిలో ఎందుకు శాశ్వత చికిత్స లేదు?
  • థైరాయిడ్‌, ఆర్థరైటిస్‌, కోలిటిస్‌, ఉబ్బస వ్యాధుల శాశ్వత నివారణకు ఫార్మా కంపెనీల వద్ద మందులు ఉన్నాయా?
  • కాలేయ వ్యాధి చికిత్సకు, గుండెలో అడ్డంకులకు, కొవ్వుకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి?
  • పార్శపు నొప్పి, మతిమరుపు, పార్కిన్‌సన్‌ వ్యాధులను ఏ విధంగా నయం చేస్తారు?
  • అలోపతి సర్వగుణ సంపన్నమని భావించకూడదు. ఎందుకంటే దీని వయసు 200 ఏళ్లే..వీటితోపాటు మరిన్ని ప్రశ్నలనూ సంధించారు.

ఆ అధికారికి చికిత్సలో మా ప్రమేయం లేదు

పతంజలి డెయిరీ వైస్‌ ప్రెసిండెంట్‌ సునీల్‌ బన్సల్‌ (57) ఇటీవల కరోనాతో మృతి చెందారు. ఆయనకు అలోపతి చికిత్స చేశారని, ఇందులో తమ ప్రమేయం లేదని ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. ఆయన రాజస్థాన్‌లోని జైపుర్‌లో చికిత్స పొందారు. ఆయన భార్య రాజస్థాన్‌ ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చికిత్స వ్యవహారాలను ఆమె చూసుకున్నారని పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: ఓటీపీతో పోస్ట్​పెయిడ్​ నుంచి ప్రీపెయిడ్​కు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.