ETV Bharat / business

కొద్ది నెలల్లో రూ.55,000 కోట్ల ఐపీఓలు - పాలసీ బజార్ ఐపీఓ

రాబోయే కొద్ది నెలల్లో డజనుకు పైగా ఆర్థిక సేవల సంస్థలు పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లే సన్నాహాల్లో ఉన్నాయి. ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సేవల సంస్థ పేటీఎం రూ.22 వేల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Initial public offering
పేటీఎం పబ్లిక్‌ ఇష్యూ
author img

By

Published : Jun 14, 2021, 8:25 AM IST

రానున్న కొన్ని నెలల్లో డజనుకు పైగా ఆర్థిక సేవల సంస్థలు పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చే అవకాశం కన్పిస్తోంది. వీటిల్లో బీమా, మ్యూచువల్‌ ఫండ్‌, వాణిజ్య బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, గృహ రుణాల సంస్థలు, చెల్లింపు బ్యాంకులు ఉన్నాయి. పబ్లిక్‌ ఇష్యూ కోసం దరఖాస్తు పత్రాలను సెబీకి ఈ సంస్థలు సమర్పించాయి. అనుమతులు రావడమే తరువాయి. ఈ సంస్థలన్నీ కలిపి తొలి పబ్లిక్‌ ఆఫర్‌ల (ఐపీఓ) ద్వారా రూ.55,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం కన్పిస్తోందని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ఇందులో అత్యధికంగా రూ.22,000 కోట్లను పేటీఎం సమీకరించే అవకాశం ఉంది. స్టాక్‌ మార్కెట్‌ జోరు మీద ఉండటం వల్లే ఎక్కువ సంస్థలు ఐపీఓల బాట పట్టడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని త్రైమాసికాల పాటు ఐపీఓల కోలాహలం కొనసాగొచ్చని అభిప్రాయపడుతున్నారు. కొత్త కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు చిన్న మదుపర్లు ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు.

చూపంతా అటు వైపే...

డిజిటల్‌ చెల్లింపుల సేవల సంస్థ పేటీఎం పబ్లిక్‌ ఇష్యూపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రూ.22,000 కోట్లు సమీకరించాలన్న ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. అనుకున్నట్లుగా అంతమొత్తం సమీకరిస్తే దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఇది చరిత్రలో నిలిచిపోతుందని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. 2010లో కోల్‌ ఇండియా సమీకరించిన రూ.15,000 కోట్లే ఇప్పటివరకు పబ్లిక్‌ ఇష్యూలో సమీకరించిన పెద్దమొత్తం. సెబీకి ఐపీఓ దరఖాస్తులు సమర్పించిన వివిధ ఆర్థిక సేవల కంపెనీలు, అవి సమీకరించే అవకాశం ఉన్న నిధుల వివరాలు పట్టికలో..

Initial public offering
కంపెనీల నిధుల సమీకరణ అంచనాలు

మరికొన్ని త్వరలో..

జులై మొదటి వారంలో క్లీన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పబ్లిక్‌ ఇష్యూ జరిగే అవకాశం ఉంది. ఈ సంస్థ రూ.1,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇండియా పెస్టిసైడ్స్‌ ఐపీఓ కూడా ఈ నెలలో లేదంటే వచ్చే నెలలో ఉండొచ్చని ఏంజెల్‌ బ్రోకింగ్‌ విశ్లేషకుడు ఒకరు చెబుతున్నారు.

మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌కు రుచిసోయా

బాబా రామ్‌దేవ్‌ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్‌కు చెందిన రుచి సోయా రూ.4,300 కోట్ల సమీకరణ లక్ష్యంతో మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌కు (ఎఫ్‌పీఓ) వచ్చే యోచనలో ఉంది. ఇందుకుగాను సెబీకి సంబంధిత దరఖాస్తు పత్రాలను సమర్పించింది. సెబీ అనుమతులు లభిస్తే వచ్చే నెలలోనే ఎఫ్‌పీఓ ఉండే అవకాశం ఉంది.

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు రూ.2,000 కోట్లు

అర్హులైన సంస్థాగత మదుపర్లకు షేర్ల జారీ ద్వారా (క్యూఐపీ) జులై చివరి కల్లా రూ.2,000 కోట్లు సమీకరించే యోచనలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఉంది. క్యూఐపీ/ రైట్స్‌ ఇష్యూ/ ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ/ బాసెల్‌ 3 బాండ్ల జారీ ద్వారా రూ.5,000 కోట్ల సమీకరణకు ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు డైరెక్టర్ల బోర్డు అనుమతినిచ్చింది.

ఇదీ చూడండి: IPO market: ఒక్క వారం.. నాలుగు ఐపీఓలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.