ప్రముఖ లగ్జరీ గాడ్జెట్స్ తయారీ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ 'ఎస్ఈ ప్లస్'ను 2021 ప్రథమార్ధంలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేసింది. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను 2021 ద్వితీయార్ధంలో భారత మార్కెట్లోకి తీసుకురానుందట యాపిల్ సంస్థ.
తక్కువ బడ్జెట్లోనే అధునాతన ఫీచర్లు ఉండడం ఐఫోన్ ఎస్ఈ ప్లస్ ప్రత్యేకత.
ఫీచర్లు ఇలా ఉండొచ్చు
- 5.5 లేదా 6.1 అంగుళాల డిస్ప్లే
- ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
- మైక్రోఫోన్, స్పీకర్
- ఏ 13 ప్రాసెసర్
ఇందులో ఫేస్ ఐడీ ఉండదు. ఈ ఫోన్ ధరపైనా ఇంకా స్పష్టత లేదు. అయితే యాపిల్ ప్రధాన ఫోన్ల కంటే తక్కువ ధర ఉండొచ్చని అంచనా. 64జీబీ వేరియంట్‌కు రూ.42,500 ప్రారంభ ధరతో ఐఫోన్ ఎస్ఈని విడుదల చేసింది.
ఇదీ చదవండి: మాంద్యం మేఘాలు: సెన్సెక్స్ 500 పాయింట్లు పతనం