ETV Bharat / business

కరోనా దెబ్బకు... కోట్లకు కోట్లు హుష్‌!

కరోనా దెబ్బకు స్టాక్​మార్కెట్లు కుప్పకూలుతున్న వేళ... దిగ్గజ పెట్టుబడిదారులు కూడా అల్లాడిపోతున్నారు. మార్కెట్ మాంత్రికుడు రాకేశ్​ ఝున్‌ఝున్‌వాలా అయితే రూ.3500 కోట్ల మేర నష్టపోయారు. మిగతా వారి పరిస్థితీ ఇంతే. దీనితో కోట్లకు కోట్లు అలా ఆవిరైపోతున్నాయి.

rakesh jhunjhunwala
రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా
author img

By

Published : Mar 21, 2020, 8:54 AM IST

కోత మొదలైంది. ఇక రాత రాసిన ఆ భగవంతుడు కూడా కాపాడలేడు.. ఇది ఓ సినిమాలో డైలాగ్‌.

స్టాక్‌ మార్కెట్లో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. డీలా పడని షేరు లేదు.. నష్టపడని మదుపరి లేడు. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా వంటి మార్కెట్‌ మాంత్రికుడే ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఆయనొక్కడే కాదు.. ఆయనలాగా కోట్లు కోట్లు పెట్టుబడులు పెట్టినవారికీ నష్టాలు పలకరిస్తూనే ఉన్నాయి.

ప్రస్తుత క్యాలెండర్‌ సంవత్సరంలో సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు 32 శాతం వరకూ నష్టపోయాయి. మార్కెట్‌ విలువ రూ.46 లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. ఇక మార్కెట్లో భారీ పెట్టుబడులు పెట్టే వ్యక్తులు(హెచ్‌ఎన్‌ఐలు) రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, ఆశిష్‌ ధావన్‌, అనిల్‌ కుమార్‌ గోయెల్‌, కుటుంబం; ఆశిష్‌ రామచంద్ర కచోలియా, డాలీ ఖన్నాలపై భారీ ప్రభావమే పడింది. వీరి పెట్టుబడులు కరిగిపోయాయి.

రాకేశ్‌కూ తప్పలేదు..

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, అతని కుటుంబం విషయానికే వస్తే ప్రస్తుత క్యాలెండర్‌ ఏడాదిలో రూ.3,554 కోట్ల మేర నష్టపోయింది. వీరి పెట్టుబడుల విలువ రూ.10,000 కోట్ల దిగువకు చేరింది. గురువారం ముగింపు ధరలతో చూస్తే ఈయన కుటుంబం మొత్తం పెట్టుబడుల విలువ రూ.8,925 కోట్లకు చేరింది. డిసెంబరు 2019 చివరి నాటికి వీరి పెట్టుబడులు రూ.12,480 కోట్లుగా ఉండడం గమనార్హం.

ఈ రెండున్నర నెలల్లో మధ్య, చిన్న స్థాయి కంపెనీలు వరుసగా 27%, 29 శాతం చొప్పున నష్టపోయాయి. రాకేశ్‌ చాలా వరకు చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో 1 శాతం పైగా వాటాలున్నాయి. ఇవన్నీ బాగా దెబ్బతినడంతో వీరికి పాలుపోవడం లేదు. ఉదాహరణకు టైటన్‌ షేరు ఇప్పటికే 24 శాతం కుంగి 52 వారాల కనిష్ఠ స్థాయి అయిన రూ.900కు చేరింది. రాకేశ్‌, ఆయన భార్య రేఖకు కలిపి ఇందులో 6.69 శాతం వాటా ఉంది. కేవలం ఈ ఒక్క కంపెనీలోనే రూ.1710 కోట్లు కోల్పోయారు.

ఇక రాకేశ్‌ పోర్ట్‌ఫోలియోలోని ఎన్‌సీసీ, డెల్టాకార్ప్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, యాప్‌టెక్‌, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌లు 50 శాతం పైగా నష్టపోయాయి. లుపిన్‌, ఎస్కార్ట్స్‌, ర్యాలీస్‌ ఇండియాలు మాత్రమే 20 శాతం లోపు నష్టాలకు పరిమితమయ్యాయి.

మిగతా వారి పరిస్థితి అంతే..

అనిల్‌ కుమార్‌ గోయెల్‌-సీమా గోయెల్‌లకు ధామ్‌పూర్‌ షుగర్‌, త్రివేణి ఇంజినీరింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, ద్వారిఏకశ్‌ షుగర్‌, ఉత్తమ్‌ షుగర్‌ వంటి వాటిలో ఉన్న పెట్టుబడుల విలువ 49 శాతం వరకు తుడిచిపెట్టుకుపోయి రూ.453 కోట్లకు పరిమితమైంది. ఇక ఆశిష్‌ ధావన్‌, ఆశిష్‌ రామచంద్ర కచోలియా, డాలీ ఖన్నాల పోర్ట్‌ఫోలియో విలువలు కూడా 36 శాతం; 44 శాతం చొప్పున క్షీణించడం గమనార్హం.

సశేషం..: కనీసం వచ్చే రెండు త్రైమాసికాలకు కరోనా నుంచి వచ్చే ప్రతికూల వార్తలకు సరిపడా నష్టం జరిగింది. అయితే కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగితే మాత్రం పతనం మరింత కొనసాగుతుంది. ఎందుకంటే సూచీలు మరింత నష్టపోవని చెప్పలేని పరిస్థితి ఉందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఊగిసలాటకు అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి సెబీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.