ETV Bharat / business

టీకా, బ్రెగ్జిట్​ వార్తలే కీలకం- లాభాల స్వీకరణకు ఛాన్స్ - VACCINE LATEST NEWS

దేశీయంగా పెద్దగా ఎలాంటి కీలక అంశాలు, ప్రకటనలు లేనందున.. ఈ వారం మార్కెట్లకు అంతర్జాతీయ అంశాలే కీలకంగా మారనున్నాయి. కొవిడ్​ టీకాపై సానుకూల ప్రకటనలు, అమెరికా ఉద్దీపన ప్యాకేజీ వార్తలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే.. లాభాల స్వీకరణకూ అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

investors-to-track-global-events-covid-19-vaccine-progress-in-holiday-shortened-week-ahead
టీకా, బ్రెగ్జిట్​ వార్తలే కీలకం- లాభాల స్వీకరణకు అవకాశం
author img

By

Published : Dec 20, 2020, 1:27 PM IST

ఈ వారం స్టాక్​ మార్కెట్లకు అంతర్జాతీయ అంశాలే కీలకం కానున్నాయి. దేశీయంగా ఎలాంటి వార్తలు, ప్రకటనలు లేనందున మదుపరులు.. కొవిడ్​ టీకా, అమెరికా ఉద్దీపన ప్యాకేజీలపై దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ వారాంతంలో శుక్రవారం క్రిస్​మస్​ సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఎఫ్​ అండ్ ఓ డెరివేటివ్​ల గడువు ముగింపు నేపథ్యంలో మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవ్వచ్చని మోతీలాల్​ ఓస్వాల్​ ఫినాన్షియల్​ సర్వీసెస్​ రిటైల్​ అధిపతి​(రీసెర్చ్​) సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు.

దేశీయ సూచీలు ఇటీవల రికార్డు స్థాయి గరిష్ఠాలను తాకిన నేపథ్యంలో.. ఈ వారం మదుపరులు అడపాదడపా లాభాల స్వీకరణకు దికే అవకాశాలే ఎక్కువని విశ్లేషించారు.

''కరోనా వ్యాక్సిన్లపై సానుకూల వార్తలు, అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై పెరుగుతున్న అంచనాలతో మార్కెట్లు లాభాల్లోనే కదలాడొచ్చు. అయితే.. ఈ వారాంతానికి ముందు క్రిస్​మస్​ సెలవు నేపథ్యంలో.. లాభాల స్వీకరణ అవకాశాలను కొట్టిపారేయలేం.''

- సిద్ధార్థ ఖేమ్కా, మోతీలాల్​ ఓస్వాల్​

అమెరికా ఉద్దీపన ప్యాకేజీ, బ్రెగ్జిట్​ ఒప్పందం వంటి అంతర్జాతీయ అంశాలు.. మార్కెట్లపై గణనీయమైన ప్రభావం చూపనున్నట్లు తెలిపారు జియోజిత్​ ఫినాన్షియల్​ సర్వీసెస్​ అధిపతి(రీసెర్చ్​) ​ వినోద్​ నాయర్​.

ఇదీ చూడండి: ఒడుదొడుకుల ట్రేడింగ్​లోనూ రికార్డు గరిష్ఠాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.