రెస్టారెంట్ల గొలుసుకట్టు సంస్థ బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూకు మదుపర్లు బ్రహ్మరథం పట్టారు. పబ్లిక్ ఇష్యూ చివరి రోజు(శుక్రవారం) ముగిసే సరికి 156.65 రెట్ల అధిక స్పందన లభించింది. అర్హులైన సంస్థాగత మదుపర్ల(క్యూఐబీ) విభాగంలో 86.64 రెట్లు, ఎన్ఐఐ విభాగంలో 354.11 రెట్లు, రిటైల్ విభాగంలో 68.14 రెట్ల స్పందన కనిపించింది. ఈ ఇష్యూ ద్వారా సంస్థ రూ.810 కోట్లు సమీకరించనుంది.
ఇష్యూలో భాగంగా కంపెనీ 13.50 కోట్ల షేర్లను విక్రయించింది. తాజాగా 7.5 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. ఆఫర్ సేల్ పద్ధతిలో మరో 6 కోట్ల షేర్లను ప్రమోటర్ సంస్థ క్యూఎస్ఆర్ ఆసియా పీటీఈ విక్రయించనుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను విక్రయశాలల విస్తరణ, రుణాల చెల్లింపునకు కంపెనీ వినియోగించనుంది. బర్గర్ కింగ్ షేర్లు ఈ నెల 14న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో నమోదయ్యే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:ఉద్యోగుల చేతికే ఎయిర్ ఇండియా!