ETV Bharat / business

ఈ 'రిటైర్​మెంట్​ ప్లాన్​'తో మలి జీవితానికి భరోసా - వీపీఎఫ్​

పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఉద్యోగం చేసేప్పుడే కొంత దాచుకోవాలి. అయితే.. మదుపు చేసేటప్పుడు సరైన పథకాలను ఎంచుకోవాలి. దీర్ఘకాలం మదుపు చేసే క్రమంలో ఎంతో క్రమశిక్షణ ఉండాలి. వీటికి సంబంధించిన కొన్ని పథకాలు.. వాటి ప్రయోజనాలను పరిశీలిద్దాం.

Retirement plan
పదవీ విరమణ
author img

By

Published : Mar 20, 2021, 11:50 AM IST

ఉద్యోగం చేస్తున్నన్ని రోజులూ కష్టపడి సంపాదిస్తాం.. పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండాలంటే.. సంపాదించే వయసులోనే కొంత దాచుకోవాలి. ఇలా చేసే క్రమంలో చిన్న పొరపాటు చేసినా.. పదవీ విరమణ నిధిపై దాని ప్రభావం పడుతుంది. అందుకే, మలి జీవితంలో తోడుండే నిధి కోసం మదుపు చేసేటప్పుడు సరైన పథకాలను ఎంచుకోవాలి. పన్ను భారం లేకుండా ఉండటం, మంచి రాబడి, స్థిరత్వం, అవసరమైనప్పుడు నగదుగా మార్చుకునే వీలూ ఉండాలి. దీర్ఘకాలం మదుపు చేసే క్రమంలో ఎంతో క్రమశిక్షణా ఉండాలి. ఈ నిధిని సాధించేందుకు ఉపయోగపడే కొన్ని పథకాలు.. వాటి ప్రయోజనాలనూ చూద్దామా...

యూనిట్‌ ఆధారిత బీమా..

బీమా రక్షణతోపాటు, పెట్టుబడి అవకాశాన్నీ కల్పించేవి యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌). అంటే.. వీటిని ఎంచుకున్నప్పుడు జీవిత బీమా రక్షణతోపాటు, మదుపు చేసే అవకాశమూ ఉంటుందన్నమాట. ఈ పాలసీకి చెల్లించిన ప్రీమియానికి సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 పరిమితి మేరకు మినహాయింపు లభిస్తుంది. ఇప్పటివరకూ ఉన్న నిబందనల ప్రకారం పాలసీ విలువలో ప్రీమియం 10శాతం వరకూ మించకుంటే.. వచ్చిన ప్రయోజనాలకు ఎలాంటి పన్ను ఉండేది కాదు. అయితే, బడ్జెట్‌ 2021లో ఆర్థిక మంత్రి దీనికి కొన్ని మార్పులు చేశారు. ఒక ఆర్థిక సంవత్సరంలో యులిప్‌లకు చెల్లించిన ప్రీమియం రూ.2.5లక్షలకు మించి ఉంటే.. ఆపై మొత్తానికి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో దీర్ఘకాలిక మూలధన రాబడికి వర్తించే పన్ను నిబంధనలే వర్తిస్తాయని పేర్కొన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో మూలధన రాబడి రూ.లక్షకు మించి వచ్చినప్పుడు ఆ పై మొత్తానికి 10శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే సూత్రం యులిప్‌లకూ వర్తిస్తుందన్నమాట. పన్ను ఆదా చేసుకోవడమే లక్ష్యంగా యులిప్‌లను ఎంచుకుంటే.. ఈ విషయాన్ని మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. యులిప్‌లకు పన్ను ప్రయోజనాలు కొంత మేరకు దూరం అవుతున్న నేపథ్యంలో.. మరో మంచి రాబడినిచ్చే పథకానికి పెట్టుబడులను మార్చడం మేలు. అయితే, యులిప్‌లకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ.2.5లక్షల లోపు ఉంటే.. మీరు ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

ఈపీఎఫ్‌.. వీపీఎఫ్‌...

సురక్షితమైన పథకాలను ఎంపిక చేసుకోవాలని అనుకుంటే ఈపీఎఫ్‌ (ఉద్యోగ భవిష్య నిధి), వీపీఎఫ్‌ (స్వచ్ఛంద భవిష్య నిధి)ని మించిన మార్గాలు లేవనే చెప్పాలి. ఉద్యోగులకు ఇది ఎంతో ప్రయోజనం కల్గించే పెట్టుబడి. ఈపీఎఫ్‌లో 8.5శాతం వడ్డీ వస్తుంది. దీనికి ఎలాంటి పన్నూ ఉండదు. ప్రస్తుతం బ్యాంకులు 4-6.5శాతం వరకూ వడ్డీని అందిస్తున్న నేపథ్యంలో ఇందులో మదుపు చేయడం లాభదాయకమే. ఇందులో జమ చేసే మొత్తానికి సెక్షన్‌ 80సీ పరిమితి మేరకు పన్ను మినహాయింపూ లభిస్తుంది. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,000లకు మించి మదుపు చేసినప్పుడు.. ఆ పై మొత్తంపై వచ్చే వడ్డీపై పన్ను భారం ఉంటుంది. దీన్ని ఈసారి బడ్జెట్‌లోనే ప్రతిపాదించారు. ఇది కొంతమందిపైనే ప్రభావం చూపుతుంది. నెలకు రూ.20వేలకు మించి ఈ ఖాతాల్లో జమ చేసేవారికి నామమాత్రపు పన్ను భారం పడుతుంది. మిగతావారు ఇందులో తమ మదుపును ఎలాంటి ఇబ్బందీ లేకుండా కొనసాగించవచ్చు.

జాతీయ పింఛను పథకం..

పదవీ విరమణ ప్రణాళికల కోసం ఒకే పథకంపై ఆధారపడటం మంచిది కాదు. అది ఈక్విటీ కానీయండి.. లేదా డెట్‌ అయినా సరే.. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) ఈక్విటీలు, కార్పొరేట్‌ డెట్, ప్రభుత్వ డెట్‌ ఫండ్లలో మదుపు చేసే వెసులుబాటుతో ఉంటుంది. ఎక్కడ మదుపు చేయాలి అనే అంశంలో అనేక అవకాశాలున్నాయి. ఇందులో మదుపు చేసిన మొత్తానికి సెక్షన్‌ 80సీ కింద రూ.1.50లక్షల వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. అదనంగా సెక్షన్‌ 80సీసీడీ కింద అదనంగా రూ.50,000 వరకూ అనుమతిస్తారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఎన్‌పీఎస్‌ నుంచి 60శాతం వరకూ ఎలాంటి పన్ను లేకుండా వెనక్కి తీసుకోవచ్చు. 40శాతాన్ని తప్పనిసరిగా యాన్యుటీ ప్లాను కొనుగోలుకు వినియోగించాలి. యాన్యుటీల ద్వారా వచ్చే పింఛనును వ్యక్తిగత ఆదాయంలో భాగంగా చూపించి, వర్తించే శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పెట్టుబడుల కేటాయింపు ఆధారంగా చూస్తే.. పదవీ విరమణ పథకంగా ఎన్‌పీఎస్‌ మంచి ఎంపికే. అయితే, పింఛను పన్ను చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి, ఆ విషయాన్నీ లెక్కలోకి తీసుకోవాలి.

ఫండ్లలో క్రమానుగతంగా..

దీర్ఘకాలం మదుపు చేస్తే ఈక్విటీ ఫండ్లలో మంచి ఫలితాలు ఆశించవచ్చు. చిన్న వయసు నుంచే పదవీ విరమణ ప్రణాళికలు వేసుకున్న వారు వీటిని ఎంచుకోవడం మంచిది. అయితే, అధిక నష్టభయం ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా మదుపు చేసినప్పుడు రూపాయి సగటు వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. పన్ను మినహాయింపు రావాలంటే.. వీటిలో ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఎంచుకోవచ్చు. వయసు, నష్టభయం భరించే సామర్థ్యం, ఆశిస్తున్న రాబడి, పెట్టుబడి వ్యవధిలాంటివి చూసుకొని ఇందులో మదుపు చేయాలి.

పదవీ విరమణ ప్రణాళిక కోసం ఎంచుకునే పెట్టుబడుల్లో ఎప్పుడూ సమతౌల్యం ఉండేలా చూసుకోవాలి. పై పథకాలతో పాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం, స్థిరాస్తుల్లోనూ కొంత మేరకు మదుపు చేయడం మంచిదే. పథకాలను ఎంచుకోవడమే కాదు. వాటిలో ఎప్పటికప్పుడు మారుతున్న నిబంధనలపైనా దృష్టి పెట్టడం తప్పనిసరి.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.