ETV Bharat / business

అంతర్జాతీయంగా ప్రయాణాలపై కరోనా ఎఫెక్ట్​

author img

By

Published : Mar 18, 2020, 8:15 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ విజృంభిస్తోన్న నేపథ్యంలో విమాన సర్వీసులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. మరి కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే విమానయాన సంస్థలు దివాలా తీయొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు, ఇంధన సంస్థలు, రిటైలర్లకు సంక్షోభంలో చిక్కుకున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

International travel is halted on the spot
అంతర్జాతీయంగా ప్రయాణాలు ఎక్కడివక్కడే నిలిచివేత

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు ఎక్కడివక్కడ నిలిచిపోతున్నాయి. ఆయా దేశాల్లో అంతర్గతంగా సర్వీసులు కొంతమేర నడుస్తున్నా, అంతర్జాతీయ మార్గాల్లో పరిస్థితి దుర్భరంగా మారింది. చైనాతో మొదలు పెట్టి, ఇటలీ, ఇరాన్‌, ఐరోపా, మధ్యప్రాచ్య దేశాలకు అమెరికా, భారత్‌ సహా పలు దేశాలుతొలుత విమాన సర్వీసులు తగ్గిస్తూ వచ్చి, ఇప్పుడు నెలరోజుల పాటు పూర్తిగా నిలిపేశాయి. గిరాకీ తగ్గినందున, మూడొంతులకు పైగా సర్వీసులను విమానయాన సంస్థలే రద్దు చేస్తూ, విమానాలను ఎక్కడికక్కడే నిలిపేస్తున్నాయి. దీనివల్ల ఆయా విమానయాన సంస్థల ఆదాయాలు, లాభాలు, షేర్ల విలువలు భారీగా పతనం అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే విమానయాన సంస్థలు దివాలా తీయొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు, ఇంధన సంస్థలు, రిటైలర్లకు సంక్షోభంలో చిక్కుకున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

ఐఏజీ (బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, స్పానిష్‌ సంస్థ ఐబేరియా మాతృసంస్థ):

లండన్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ఏప్రిల్‌ - మే నెలల్లో 75 శాతం సర్వీసులు నిలిపేస్తున్నట్లు తెలిపింది. ఈ సంస్థ షేరు విలువ 27 శాతం క్షీణించింది. అయితే యాజమాన్య మార్పు చేయడం లేదని వెల్లడించింది.

  • రాబోయే 2 నెలల్లో 70-90 శాతం విమానాలు తగ్గిస్తున్నట్లు ఎయిర్‌ఫ్రాన్స్‌ ప్రకటించింది. ఈ సంస్థ షేరు 17 శాతం పతనమైంది.
  • గురువారం నుంచి అన్ని విమానాలు నిలిపేస్తున్నట్లు ఆస్ట్రియన్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. పరిస్థితి మెరుగుపడే వరకు 90 శాతం విమానాలు ఆపుతామని ఫిన్‌ఎయిర్‌ తెలిపింది.
  • వర్జిన్‌ అట్లాంటిక్‌ (బ్రిటన్‌) ప్రస్తుతం తమ విమానాల్లో 75 శాతం, వచ్చే నెలలో 85 శాతం నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. తమ కార్యకలాపాలు కొనసాగాలంటే 9.2 బిలియన్‌ డాలర్లు (రూ.68,000 కోట్లకు పైగా) అత్యవసరంగా సాయం చేయాలని బ్రిటన్‌ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.
  • జర్మనీలో లుఫ్తాన్సా మూడింట రెండొంతుల విమానాలను రాబోయే కొన్ని వారాల పాటు నిలిపేయనుంది. అంతర్జాతీయ సర్వీసుల్లో 90 శాతం వరకు కోత విధిస్తోంది.
  • అంతర్జాతీయ సర్వీసులు 90 శాతం, దేశీయ సర్వీసులు 60 శాతం తగ్గిస్తున్నట్లు ఆస్ట్రేలియా సంస్థ క్వాంటాస్‌ ప్రకటించింది.

3 నెలల వరకే నగదు నిల్వలు: ఐటా

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విమానయాన సంస్థల వద్ద నగదు నిల్వలు స్వల్పంగానే ఉన్నాయని విమానయాన సంస్థల సంఘం ఐటా ముఖ్య ఆర్థికవేత్త బ్రెయిన్‌ పియర్స్‌ పేర్కొన్నారు. మూడొంతులకు పైగా సంస్థల వద్ద 3 నెలల నిర్వహణకు సరిపడా నిధులు కూడా లేవనే సమాచారం ఉందన్నారు. ప్రపంచంలోని విమానయాన సంస్థల్లో 82 శాతానికి సమానమైన 290 సంస్థలు ఐటాలో సభ్యులు. ప్రపంచం మొత్తంమీద 200 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.14.80 లక్షల కోట్ల) ఆర్థిక సాయం విమానయాన రంగానికి అవసరమని పేర్కొన్నారు.

దేశీయ సంస్థలు ఇలా...

పర్యటక, ఇ-వీసాల జారీని మనదేశం నిలిపేయడంతో, అంతర్జాతీయ సర్వీసులను ఎయిరిండియా, ఇండిగో గణనీయంగా తగ్గించాయి. ప్రయాణ తేదీ మార్చుకున్నా, ఛార్జీలను దేశీయ విమానయాన సంస్థలు వసూలు చేయడం లేదు. విదేశీ సంస్థలు కూడా భారత్‌కు వచ్చి, పోయే 500 సర్వీసులను రద్దు చేశాయి. ఐరోపా సమాఖ్య, టర్కీ, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, యూఏఈ, ఖతార్‌, ఒమన్‌, కువైట్‌, ఆప్ఘనిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌, మలేషియా దేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలను మనదేశం విధించింది.

గో-ఎయిర్‌: ఏప్రిల్‌ 15 వరకు అంతర్జాతీయ సర్వీసులు రద్దు చేయడమే కాక, సిబ్బందికి వేతనం లేని సెలవును చౌకధరల సంస్థ గోఎయిర్‌ తాజాగా ప్రకటించింది. విడతలుగా దాదాపు 35 శాతం మంది సిబ్బందిని ఇలా సెలవుపై పంపాలన్నది సంస్థ యోచనగా చెబుతున్నారు. వేతనాల్లో 20 శాతం కోత విధించాలనీ నిర్ణయించినట్లు సమాచారం.

అమెరికా విమానయాన సంస్థలు

2011 నాటి భయానక తీవ్రవాద దాడుల అనంతరం కంటే ప్రస్తుత స్థితి దారుణంగా మారిందని, కార్యకలాపాలు కొనసాగించాలంటే 50 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.70 లక్షల కోట్ల) ఉద్దీపన పథకం అత్యవసరంగా ప్రకటించాలని అమెరికా ప్రభుత్వాన్ని అక్కడి విమానయాన సంస్థలు కోరుతున్నాయి. ఐరోపానకు రాకపోకలు నెలరోజులు నిలిపేయడంతో, ఏప్రిల్‌- మే నెలల్లో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ 50 శాతం, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ అంతర్జాతీయ మార్గాల్లో 75 శాతం సర్వీసులు నిలిపేశాయి. డెల్టా, సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా విమానాలు నిలిపేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది ఆఖరుకు 23 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.70 లక్షల కోట్ల) నగదు లభ్యత సమస్యలు ఎదురవుతాయని సంస్థలు పేర్కొంటున్నాయి.

ప్రయాణించేందుకు విముఖత

అనేక రోజుల పాటు కొత్త బుకింగ్‌లు లేకపోవడంతో పాటు, అత్యధికులు తమ బుకింగ్‌లు రద్దు చేసుకుని, ఇంట్లో ఉండేందుకే ప్రయాణికులు సుముఖత చూపుతున్నారని వర్జిన్‌ అట్లాంటిక్‌ తెలిపింది. విమానయాన సంస్థల పరిస్థితి అంతకంతకూ దుర్భరంగా మారుతుందని పేర్కొంది.

ఆదుకుంటాం: ప్రభుత్వాలు

కంపెనీలు దివాలా తీయకుండా ఆదుకుంటామని జర్మనీ ప్రభుత్వం తెలిపింది. విమానయాన సంస్థలే కాక, కరోనా బారిన పడిన అన్ని వ్యాపారాలకు సహకరిస్తామని బ్రిటిష్‌ ప్రధాని ప్రతినిధి వెల్లడించారు.

సంస్థలేం చేస్తున్నాయి?

  • అత్యవసరం కాని, సైబర్‌భద్రతతో సంబంధం లేని ఐటీ వ్యయాలను నిలిపేస్తున్నాయి
  • కొత్తనియామకాలు, వ్యయాలు తగ్గిస్తున్నాయి
  • స్వచ్ఛందంగా సెలవు తీసుకోవాలని సిబ్బందిని కోరడంతో పాటు ఉద్యోగ కాంట్రాక్టులను తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నాయి.
  • పనిగంటలూ సాధ్యమైనంత తగ్గిస్తున్నాయి

ఐఎస్‌బీలో క్లాసుల రద్దు

హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక మేనేజ్‌మెంట్‌ విద్యా సంస్థ ఐఎస్‌బీ (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌) విద్యార్ధులకు క్లాసులు రద్దు చేసింది. మిగిలిన పాఠ్యప్రణాళికను ఆన్‌లైన్లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. బుధవారం సాయంత్రానికల్లా హాస్టల్‌ గదులను ఖాళీ చేయాల్సిందిగా విద్యార్ధులకు సూచించింది. కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) విస్తరణను అడ్డుకునేందుకు హైదరాబాద్‌, మొహాలీ కేంపస్‌లలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు ఐఎస్‌బీ వెల్లడించింది. వచ్చే నెల మొదటి వారంలో ఐఎస్‌బీ విద్యార్ధుల గ్రాడ్యుయేషన్‌ సమావేశం జరగాల్సి ఉండగా, దాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు ఐఎస్‌బీ డిప్యూటీ డీన్‌ డాక్టర్‌ ఫిలిప్‌ ఛార్లెస్‌ వివరించారు.

కీలక రంగాలపై ప్రతికూల ప్రభావం

ఈ ఏడాదిలో భారత జీడీపీ వృద్ధి 5.3 శాతానికి తగ్గొచ్చని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ అంచనా వేసింది. ఫిబ్రవరిలో మూడీస్‌ భారత వృద్ధి 5.4 శాతంగా అంచనా వేసింది. అంతకు ముందు 6.6 శాతంగా ఉండొచ్చని చెప్పినప్పటికీ.. క్రమంగా వృద్ధి అంచనాలను తగ్గిస్తూ వస్తోంది. 2019లో వృద్ధి అంచనా కూడా 5.3 శాతమే కావడం గమనార్హం. ఇక 2018లో భారత వృద్ధి 7.4 శాతంగా నమోదైంది. 2021లో వృద్ధి రేటు 5.8 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ఆర్థికాభివృద్ధి గణనీయంగా నెమ్మదించే అవకాశం ఉందని మూడీస్‌ అభిప్రాయపడింది. విమానయాన సంస్థలు, నౌకాయానం, వసతి, వినోదం, రెస్టారెంట్లు వంటి వాటికి ఇబ్బందులు తప్పవని మూడీస్‌ పేర్కొంది.

వీడియో కాన్ఫరెన్స్‌లతో బ్యాంకుల సమావేశాలు

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలపై కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావం పడింది. ఇండియన్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంకుల విలీనం చివరి దశకు చేరుకున్న తరుణంలో.. ఈ బ్యాంకుల బోర్డు సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విలీన ప్రక్రియ సాఫీగా సాగుతోందని, క్షేత్రస్థాయి సమావేశాలు మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విలీన ప్రక్రియ ఆలస్యం కాకుండా ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇంటి నుంచే పనిచేయండి: ఫోర్డ్‌

భారత్‌లోని 10,000 ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా వాహన దిగ్గజం ఫోర్డ్‌ ఆదేశించింది. కీలక పదవుల్లో ఉన్నవారికి మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. ఫోర్డ్‌ కేంద్రాల్లో అన్ని భద్రతా చర్యలు చేపట్టామని, విక్రయశాలల్లో సైతం వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఫోర్డ్‌ పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే వోల్వో, ఫియట్‌ క్రిస్లర్‌ ఇండియా ఇదే విధమైన చర్యలు చేపట్టాయి. గత 2 వారాల్లో విదేశాల్లో పర్యటించిన ఉద్యోగులను స్వీయ నిర్భందంలో ఉండాల్సిందిగా మారుతీ సుజుకీ, మహీంద్రా గ్రూప్‌ కోరాయి.

వీరిపై ప్రభావం

  • ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు, విమానయాన సంస్థల్లో ఉద్యోగులు: 40 లక్షలు
  • అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్న వారు: కోట్లలో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.