చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు సహకార బ్యాంకు రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది ఆర్బీఐ. అందుకు సంబంధించిన నిబంధనలను కూడా సవరించింది.
ఎంఎస్ఎంఈలకు రుణ రాయితీ పథకాన్ని 2018 నవంబర్లో ప్రకటించింది ప్రభుత్వం. వాణిజ్య బ్యాంకులకు సంబంధించి ఈ రుణాలను తొలుత 2018-19, 2019-20 రెండు ఆర్థిక సంవత్సరాలకు షెడ్యూల్ చేసింది. తాజాగా.. దీనిని 2020-21 ఆర్థిక సంవత్సరానికి పొడిగించింది.
సహకార బ్యాంకులు కూడా 2020 మార్చి 3 నుంచి రుణ సంస్థలుగా అర్హత పొందాయి. ఈ కవరేజీ మొత్తం అన్ని రకాల టర్మ్ లోన్లకు వర్తిస్తుంది.
ఇదీ చూడండి: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రాజేశ్వర్ రావు