ETV Bharat / business

మారిన బ్యాంక్​ రూల్స్​.. కొత్త నిబంధనలు ఇవే..

Bank Rules Changes From 1st December: డిసెంబర్​ ఒకటో తేదీ నుంచి స్టేట్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ కూడా కీలక వడ్డీరేట్లను సవరించింది.

bank
బ్యాంక్​
author img

By

Published : Dec 1, 2021, 6:11 PM IST

Bank Rules Changes From 1st December: డిసెంబర్​ ఒకటో తేదీ నుంచి కొన్ని బ్యాంకుల​ నిబంధనలు ​ మారాయి. వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ), పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​. కొత్త నిబంధనల్లో భాగంగా నెలవారీగా చెల్లించే ఈఎంఐ చెల్లింపులకు సంబంధించి ప్రాసెసింగ్​ ఫీజ్​ను వసూలు చేయనుంది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. ఇదిలా ఉంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రం వడ్డీ రేట్లను మరింత తగ్గించాలని నిర్ణయించింది. వీటితో పాటు పెన్షనర్లు హెడ్ పోస్టాఫీసుల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ తప్పినిసరిగా సమర్పించాలని అధికార వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. వీటి గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం.

ప్రోసెసింగ్​ ఫీజు వసూలు..

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) నేటి నుంచి (డిసెంబర్ 1, 2021) ప్రారంభమయ్యే నెలవారీ ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ రుసుములను వసూలు చేయాలని నిర్ణయించింది. నెలసరి వాయిదాల ద్వారా చేసే కొనుగోళ్లపై, ముందుగా చేసిన లావాదేవీలను ఈఎంఐగా మార్చడంపై ప్రాసెసింగ్ రుసుమును విధిస్తుంది. ఈఎంఐ లావాదేవీల కోసం, ఎస్​బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు వారు చెల్లించే పన్నుతో పాటు రూ. 99 మేర ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని ఎస్​బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది.

వడ్డీ రేట్లను తగ్గిస్తూ...

చిన్న మొత్తాల్లో పొదుపు చేసేవారికి పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ షాక్​ చేసింది. నేటి నుంచి పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను మరింత తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఓ ఏడాదికిగానూ రూ. 10 లక్షల కంటే తక్కువ బ్యాలెన్స్​ ఉన్న సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై ఉన్న 10 బేస్​ పాయింట్లను 2.80 శాతం మేర తగ్గించింది. దీనితో పాటు రూ. 10 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉన్న ఖాతాలపై 5 బేసిస్ పాయింట్లను 2.85 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చాయి.

పెన్షనర్ల లైఫ్​ సర్టిఫికేట్​(pension life certificate)..

నేటి నుంచి (డిసెంబర్​ 1, 2021) పెన్షనర్లు వార్షిక జీవిత ధ్రువీకరణ (లైఫ్ సర్టిఫికేట్) పత్రాన్ని సమర్పించడం తప్పనిసరిగా మారింది. దేశంలోని ఏదైనా ప్రధాన పోస్టాఫీసు జీవన్ ప్రమాణ్ కేంద్రాల్లో సమర్పించాల్సి ఉండగా.. 80 ఏళ్లు పైబడిన వ్యక్తులు అక్టోబర్ 1నుంచే లైఫ్ సర్టిఫికేట్లను సమర్పిస్తున్నారు. అయితే ఇందుకు నవంబర్​ 30 ఆఖరి తేదీ అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సర్టిఫికేట్​ను సమర్పించి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఇంకా ఈ పత్రాన్ని సమర్పించకపోతే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ నిబంధన నేటి నుంచే అమలులోకి వచ్చింది.

ఇదీ చూడండి:

LPG Cylinder Price: వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్​ ధర!

ట్విట్టర్​ కొత్త రూల్​- ఇతరుల ఫొటోలు షేర్​ చేస్తే ఇక అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.