ETV Bharat / business

పీపీఎఫ్‌పై వడ్డీ రేటు తగ్గింపు

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 1.1శాతం వరకు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి త్రైమాసికాల వారీగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు. మరోవైపు పీపీఎఫ్​పైనా వడ్డీ రేట్లలో కోత విధించింది.

PPF
పీపీఎఫ్‌
author img

By

Published : Apr 1, 2021, 6:27 AM IST

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం బుధవారం వడ్డీ రేట్లను 1.1 శాతం వరకు తగ్గించింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) వడ్డీరేటుపై 0.7 శాతం, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌ఎస్‌సీ) వడ్డీరేటుపై 0.9 శాతం తగ్గించింది. సేవింగ్స్‌ డిపాజిట్లపై 0.5 శాతం కోత విధించింది.

PPF
పీపీఎఫ్‌పై వడ్డీ రేటు తగ్గింపు

చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి త్రైమాసికాల వారీగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు. ఈమేరకు 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30) సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్పులు చేసినట్లు ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.పీపీఎఫ్‌పై ఇంత తక్కువ వడ్డీరేటు నిర్ణయించడం 1974 తర్వాత ఇదే ప్రథమం.

ఇదీ చదవండి: కరోనాలోనూ భారీగా పెరిగిన 'హెచ్​ఏఎల్​​' ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.