ETV Bharat / business

'2021-22 బడ్జెట్​ రూపకల్పనకు  సూచనలివ్వండి' - ఈ మెయిల్​ ద్వారా బడ్జెట్​ సూచనలు

2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టే సాధారణ బడ్జెట్​ను తయారు చేసేందుకు సూచనలివ్వాలని నిపుణులు, వ్యాపార సంస్థలు, సామాన్య ప్రజలను కోరింది ఆర్థిక శాఖ. ఈ మేరకు ప్రత్యేక వెబ్​సైట్​ రూపొందిస్తున్నట్లు పేర్కొంది.

Fin Min_Budget 2021
'2021 సాధారణ బడ్జెట్​పై సూచనలివ్వండి'
author img

By

Published : Nov 13, 2020, 6:49 PM IST

వచ్చే ఏడాది ప్రవేశ పెట్టే సాధారణ బడ్జెట్​పై సూచనలు, ప్రతిపాదనలు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. కొవిడ్-19 అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన దృష్ట్యా... బడ్జెట్​పై కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక సంఘాలు, పలువురు నిపుణులు సూచనలివ్వాలని పేర్కొంది.

వివిధ సంస్థలు.. వారి సలహాలను ఈ-మెయిల్​ ద్వారా పంపాలని కోరింది. నవంబర్​ 15 నుంచి 30 వరకు సామాన్య ప్రజలు కూడా 'మై గవర్నమెంట్' వెబ్​ సైట్​ ద్వారా సలహాలను పంపే అవకాశం కల్పించింది.

నిపుణులు, ఇతర వాణిజ్య సంస్థలతో బడ్జెట్ పై జరిపే ముందస్తు చర్చలను ఈ సారి భిన్నంగా నిర్వహించనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:పండుగ డిమాండ్​తో పసిడి మరింత ప్రియం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.