భారతదేశం- సోమాలియా మధ్య వాణిజ్యాన్ని పెంపొందించేందుకు, వ్యాపార అవకాశాల మార్పిడి కోసం ఇండో- సోమాలియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆఫ్రికా నుంచి వ్యాపారులు, ప్రభుత్వ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశం, సోమాలియాల వ్యాపారులు కలిసి దీనిని స్థాపించారు. భారతదేశం నుంచి సోమాలియాకు 600 మిలియన్ డాలర్లు వర్తకం జరుగుతుంది.
కేవలం హైదరాబాద్ నుంచే ఆ స్థాయిలో వర్తకం జరిగే వీలు ఉందని వ్యవస్థాపకుల్లో ఒకరైన డా. కిరణ్ తెలిపారు. సాంకేతికత అందుబాటులో ఉన్నందున సోమాలియా డిజిటలైజేషన్‌లో నగరం ప్రధాన పాత్ర పోషించగలదని, ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఆఫ్రికాకు టీకాలు ఎగుమతి అవుతున్నాయని, భవిష్యత్తులో కరోనా టీకా విషయంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని జయేశ్ రంజన్ అన్నారు.
హైదరాబాద్‌లో చాలా మంది ఇతర దేశాల్లో వ్యాపార అవకాశాల గురించి తమను సంప్రదిస్తుంటారని, ఈ ఛాంబర్స్ ద్వారా వారికి అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు.