కరోనా సంక్షోభం కారణంగా 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. కొన్ని త్యాగాలు చేయనిదే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి సంస్థ బయటపడటం కష్టంగా కనిపిస్తోందన్నారు ఇండిగో సీఈఓ రోనోజోయ్ దత్తా.
అన్ని అంశాలను సమీక్షించిన తర్వాత తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి సంస్థలో 10 శాతం ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు దత్తా. ఇండిగో చరిత్రలోనే ఇలాంటి బాధాకరమైన నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు.
గతేడాది మార్చి 31 వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. ఇండిగోలో 23,531 మంది ఉద్యోగులు ఉన్నారు.
ఇదీ చదవండి: 'ఆ విషయంలో ఒక్క సెకను కూడా వాదనలు వినం'