అమెరికా ప్యాకేజీ ఆశలు..
స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 120 పాయింట్లు పెరిగి 45,195 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి 13,318 వద్ద కొనసాగుతోంది.
అమెరికా మరో ఉద్దీపన ప్యాకేజీపై పెరుగుతున్న అంచనాలు, కొవిడ్ వ్యాక్సిన్ ఆశల నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. దేశీయంగా ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా వేగంగా రికవరీ అవుతున్నట్లు వరుసగా వెలువడుతున్న నివేదికల అంచనాలు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.
- ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
- కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, హెచ్సీఎల్, టీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.