దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market today) సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 228 పాయింట్లు బలపడి 52,328 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 15,781 వద్ద ముగిసింది. ప్రధానంగా విద్యుత్, అన్ని పెద్ద కంపెనీల షేర్లు లాభాలను గడించాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయంగా కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం, రుతుపవనాల పురోగతి ఆశాజనకంగా ఉండటం మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి. దీంతో సూచీలు లాభాల బాట పట్టాయి.
ముప్పై షేర్ల ఇండెక్స్‌లో విద్యుత్ షేర్లు అయిన ఎన్టీపీసీ, పవర్గ్రిడ్లు టాప్‌లో ఉండగా.. అదాని పవర్ మాత్రం ఈ ఒక్కరోజే 20 శాతం లాభపడింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 52,378 పాయింట్ల అత్యధిక స్థాయి, 52,054 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,773 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,678 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభ నష్టాల్లోనివి ఇవే..
- ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, ఎల్ అండ్ టీ, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.
- బజాజ్ ఫినాన్స్, జజాజ్ ఫిన్సర్వ్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టపోయాయి.