ETV Bharat / business

ప్రచారం ఎక్కువ- విషయం తక్కువ: ప్యాకేజ్​పై ఫిచ్​

ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఫిచ్​ సొల్యూషన్స్... మోదీ ప్రకటించిన కరోనా ప్యాకేజీపై సునిశిత విమర్శలు చేసింది. ప్యాకేజీ చూడడానికి చాలా భారీగా కనిపిస్తున్నా.. వాస్తవంలో అది చాలా చిన్నదని తేల్చిచెప్పింది. ప్రభుత్వం జీడీపీలో 10 శాతం నిధుల్ని ఉద్దీపనగా ప్రకటించామని చెబుతున్నా... వాస్తవంలో అది 1 శాతం మాత్రమేనని పేర్కొంది. మొత్తానికి ఈ ప్యాకేజీ తక్షణ సమస్యలను పరిష్కరించలేదని ఫిచ్​ అభిప్రాయపడింది.

author img

By

Published : May 19, 2020, 4:44 PM IST

India's 'mammoth' COVID-19 package much smaller than it seems, says Fitch Solutions
మోదీ ప్యాకేజీపై ఫిచ్ కామెంట్​

మోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ చూడడానికి భారీగా ఉన్నా... వాస్తవానికి అది చాలా చిన్నది అని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఫిచ్​ సొల్యూషన్ పేర్కొంది. జీడీపీలో 10 శాతానికి సమానమైన రూ.20 లక్షల కోట్ల నిధులను ప్యాకేజీగా అందించామని ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవానికి జీడీపీలో 1 శాతం మాత్రమే కేటాయించిందని ఫిచ్ కుండబద్దలు కొట్టింది.

ప్యాకేజీపై మోదీ ప్రకటన తరువాత రంగంలోకి దిగిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు విడతలుగా వివిధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించారు. తమ ప్రభుత్వం చెప్పినదాని కంటే అదనంగా కొంత కలిపి... మొత్తంగా రూ.20.97 లక్షల కోట్ల ప్యాకేజీని అందించిందని సగర్వంగా చెప్పారు.

వృద్ధికి ఊతం ఏది?

మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు.. తక్షణ సమస్యలను పరిష్కరించానికి ఏమాత్రం సరిపోవని ఫిచ్​ స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి 1.8 శాతం వృద్ధి అంచనాలు చేరుకోవడం కష్టమేనని అభిప్రాయపడింది.

"మోదీ సర్కార్ ప్రకటించిన కరోనా ప్యాకేజీలో సగం నిధులు... గతంలో ప్రకటించిన ఆర్థిక చర్యలకే సరిపోతాయి. ఇది చాలదన్నట్లు రూ.7 లక్షల కోట్ల నగదీకరణ చేయాలని ఆర్​బీఐకి విజ్ఞప్తి చేసింది. ఆర్​బీఐ ద్వారానే మిగతా ప్యాకేజీ నిధులు ఆయా రంగాలకు కేటాయిస్తామని చెబుతోంది. ప్రభుత్వం ఇలాంటి ధోరణి ప్రదర్శించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ఒనగూరేది ఏమీ లేదు."

- ఫిచ్ సొల్యూషన్స్​

ప్రభుత్వం సమర్థమైన ఉద్దీపనలు అమలుచేయకుండా ఆలస్యం చేస్తే ఆర్థిక మందగమనం మరింత తీవ్రం అవుతుందని ఫిచ్​ హెచ్చరించింది.

" 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను భారత దేశ ఆర్థిక లోటు అంచనాలు 6.2 శాతం నుంచి 7 శాతానికి పెరిగితే... జీడీపీ అంచనాలు 11 శాతం నుంచి 9 శాతానికి తగ్గాయి."

- ఫిచ్​ సొల్యూషన్స్

ఆదాయం తగ్గుతుంది..

కేంద్రం మే 31 వరకు లాక్​డౌన్ పొడిగించింది. ఇలా పదేపదే లాక్​డౌన్​ పొడిగించడం వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఫిచ్​ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ ఆదాయం 18.1 శాతం మేర తగ్గవచ్చని అంచనా వేసింది. వ్యక్తిగత ఆదాయం తగ్గి, నిరుద్యోగం 20 శాతం పెరిగిపోతుందని హెచ్చరించింది.

ఇదీ చూడండి: మోదీ ప్యాకేజీతో పూర్తిగా గట్టెక్కడం కష్టమే: మూడీస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.