ETV Bharat / business

బంగారం దేశీయంగా భళా- అంతర్జాతీయంగా డీలా - ప్రపంచవ్యాప్తంగా తగ్గిన పసిడి డిమాండ్

కరోనా రెండో దశ సంక్షోభమున్నా భారత్​లో పసిడికి డిమాండ్ పెరిగినట్లు వరల్డ్ గోల్డ్​ కౌన్సిల్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో.. 2020 క్యూ2తో పోలిస్తే బంగారం డిమాండ్ 19.2 శాతం పెరిగినట్లు తెలిపింది. అయితే అంతర్జాతీయంగా మాత్రం డిమాండ్ దాదాపు ఫ్లాట్​గా ఉన్నట్లు వివరిచింది. డబ్ల్యూజీసీ నివేదికలోని మరిన్ని కీలక విషయాలు ఇలా ఉన్నాయి.

Gold Bars Coins
గోల్డ్​ బార్లు కాయిన్లు
author img

By

Published : Jul 29, 2021, 1:56 PM IST

Updated : Jul 29, 2021, 5:13 PM IST

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశీయంగా బంగారం డిమాండ్​ 19.2 శాతం పెరిగి.. 76.1 టన్నులకు చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్​ (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక ద్వారా తెలిసింది. అయితే గత ఏడాది ఇదే సమయంలో కరోనా సంక్షోభం వల్ల పసిడి డిమాండ్ 63.8 శాతానికి పరిమితమైనట్లు వెల్లడించింది.

'విలువ పరంగా.. ఈ ఏడాది ఏప్రిల్​-జూన్​ మధ్య పసిడి డిమాండ్​ 23 శాతం పెరిగి.. రూ.32,810 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ మొత్తం రూ.26,600 కోట్లుగా ఉంది' అని డబ్ల్యూజీసీ పేర్కొంది.

ఆభరణాల విభాగంలో పసిడి డిమాండ్​.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 25 శాతం పెరిగి.. 55.1 టన్నులకు చేరింది. 2020 క్యూ2లో ఇది 44 టన్నులుగా ఉంది. ఇదే కాలానికి విలువ పరంగా.. పసిడి డిమాండ్​ రూ.18,350 కోట్ల నుంచి రూ.23,750 కోట్లకు (29 శాతం) పెరిగింది.

పసిడిపై పెట్టుబడులు 2021 క్యూ2లో 10 శాతం పెరిగి (2020తో పోలిస్తే) రూ.8,250 నుంచి రూ.9,060 కోట్లకు చేరాయి.

పసిడి డిమాండ్​ ఇలా..

దేశీయంగా పసిడి డిమాండ్ పుంజుకున్నప్పటికీ.. అంతర్జాతీయంగా మాత్రం ఫ్లాట్​గా ఉన్నట్లు డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొంది. వినియోగదారుల నుంచి రికవరీ భారీగా ఉన్నప్పటికీ.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ ఒక శాతం తగ్గి.. 955.1 టన్నులుగా నమోదైంది. ఈటీఎఫ్​లలోకి ఇన్​ఫ్లో తగ్గటం ఇందుకు కారణంగా పేర్కొంది.

2020 రెండో త్రైమాసికంలో అంతర్జాతీయ పసిడి డిమాండ్ 960.5 టన్నులుగా ఉండటం గమనార్హం.

అయితే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో వినియోగదారుల నుంచి మాత్రం డిమాండ్ 60 శాతం పెరిగి.. 390.7 టన్నులుగా నమోదైనట్లు తెలిపింది డబ్ల్యూజీసీ. గత ఏడాది ఇదే సమయంలో ఈ డిమాండ్ 244.5 టన్నులుగా తెలిపింది.

గోల్డ్​ బార్స్​, కాయిన్ల రూపంలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా 2020 క్యూ2తో పోలిస్తే.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 156.7 టన్నుల నుంచి 243.8 టన్నులకు పెరిగినట్లు వివరించింది డబ్ల్యూజీసీ.

ఇదీ చదవండి:Gold Rate Today: ఏపీ, తెలంగాణలో తగ్గిన బంగారం ధరలు

Last Updated : Jul 29, 2021, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.