ETV Bharat / business

11 నెలల గరిష్ఠానికి ఇంధన డిమాండ్

వరుసగా నాలుగో నెలలోనూ దేశీయ ఇంధన గిరాకీ మెరుగుపడింది. డిసెంబర్​లో పెట్రో ఉత్పత్తుల వినియోగం 18.59 మిలియన్ టన్నులకు చేరి 11 నెలల గరిష్ఠాన్ని నమోదు చేసింది. కొవిడ్ పూర్వస్థితితో పోలిస్తే ఇది 2 శాతం తక్కువ అని పెట్రోలియం ప్లానింగ్, అనాలసిస్ సెల్ వివరించింది.

India's fuel demand at 11-month high in Dec
11 నెలల గరిష్ఠానికి ఇంధన డిమాండ్
author img

By

Published : Jan 9, 2021, 3:49 PM IST

కరోనా కారణంగా డిమాండ్ లేమితో సతమతమైన భారత ఇంధన మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. వరుసగా నాలుగో నెలలోనూ ఇంధన గిరాకీ పెరిగింది. ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్న వేళ.. 2020 డిసెంబర్​లో పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ 18.59 మిలియన్ టన్నులుగా నమోదైంది. కొవిడ్ పూర్వ స్థితితో పోలిస్తే ఇది 2 శాతం తక్కువ. అయితే, గత పదకొండు నెలల్లో అత్యధిక డిమాండ్ డిసెంబర్​లోనే నమోదు కావడం విశేషం.

ఫిబ్రవరి 2020 తర్వాత పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం డిసెంబర్​లోనే అత్యధికంగా ఉందని కేంద్ర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్, అనాలసిస్ సెల్ వెల్లడించింది.

  • కర్మాగారాల్లో ఉపయోగించే నాఫ్తా డిమాండ్ డిసెంబర్​లో 2.67 శాతం పడిపోయి 1.23 మిలియన్ టన్నులకు చేరింది.
  • రహదారి నిర్మాణాల్లో వాడే బిట్యుమెన్ వినియోగం 20 శాతం అధికమై.. 7.61 లక్షల టన్నులకు పెరిగింది.
  • ఎల్​పీజీ డిమాండ్ 7.4 శాతం పెరిగి 2.53 మిలియన్ టన్నులకు చేరుకుంది.
  • ఏవియన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) అమ్మకాలు 41 శాతం పడిపోయి.. 4.28 లక్షల టన్నులకు పరిమితమయ్యాయి. అయితే నవంబర్​తో పోలిస్తే డిసెంబర్​లో ఏటీఎఫ్ డిమాండ్ 13.5 శాతం పెరగడం గమనార్హం.

పెట్రోల్, డీజిల్ డిమాండ్ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే కొవిడ్ పూర్వ స్థితికి చేరాయి. అయితే, నవంబర్, డిసెంబర్​లో ఈ డిమాండ్ మళ్లీ తగ్గింది. క్రితం సంవత్సరం లెక్కలతో పోలిస్తే.. అక్టోబర్​లో 7.4 శాతం పెరిగిన డిమాండ్.. నవంబర్​లో 6.9 శాతం, డిసెంబర్​లో 2.7 శాతం తగ్గింది.

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించడం వల్ల ఏప్రిల్​లో ఇంధన డిమాండ్ 49 శాతం పడిపోయింది. పరిశ్రమలు మూతపడటం, వాహనాలు ఇళ్లకే పరిమితం కావడం వల్ల వినియోగంపై ప్రభావం చూపింది.

ఇదీ చదవండి: రికార్డు స్థాయికి మ్యూచువల్​ ఫండ్ల విక్రయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.