ETV Bharat / business

100 అంకురాలు- విలువ రూ.18 లక్షల కోట్లు

అత్యంత విలువైన అంకుర సంస్థలకు భారత్​ కేంద్రంగా మారిందని స్విట్జర్లాండ్​ బ్రోకరేజీ సంస్థ క్రెడిట్​ సూయిజ్​ వె​ల్లడించింది. దేశంలో అన్నిరంగాల్లో కలిపి 100 యూనికార్న్​లు ఉన్నాయని తన నివేదికలో తెలిపింది. వీటి సంయుక్త విలువ 24వేల కోట్ల డాలర్లకుపైగా ఉంటుందని పేర్కొంది.

Indian has become a hub for the most valuable start-ups, Says Credit Suisse
వావ్‌.. 100 అంకురాలు విలువ.. రూ.18 లక్షల కోట్లు
author img

By

Published : Mar 24, 2021, 6:24 AM IST

అత్యంత విలువైన అంకుర సంస్థల(యూనికార్న్‌)కు భారత్‌ కేంద్రంగా మారిందని స్విట్జర్లాండ్‌ బ్రోకరేజీ సంస్థ క్రెడిట్‌ సూయిజ్‌(సీఎస్‌) వెల్లడించింది. భారత్‌లో అన్ని రంగాల్లో కలిపి 100 యూనికార్న్‌లు ఉన్నాయని.. వీటి సంయుక్త విలువ 24,000 కోట్ల డాలర్లకుపైగా(సుమారు రూ.18లక్షల కోట్లు) ఉంటుందని క్రెడిట్‌ సూయిజ్‌ ఇండియా ఈక్విటీ వ్యూహకర్త నీల్‌కాంత్‌ మిశ్రా వెల్లడించారు. యూనికార్న్‌ అంటే 100 కోట్ల డాలర్లకుపైగా విలువ కలిగిన అంకుర సంస్థ. వీటిల్లో 2/3 వంతుసంస్థలు 2005 తర్వాత ఏర్పాటైనవే. నమోదిత కంపెనీల్లో 336 స్క్రిప్‌లు 100 కోట్ల డాలర్లకుపైగా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.

క్రెడిట్‌ సూయిజ్‌ నివేదికలోని మరిన్ని అంశాలివీ...

  • యూనికార్న్‌ క్లబ్‌లో ఆర్థిక సాంకేతిక (ఫిన్‌టెక్‌) సంస్థలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. 5 అంకుర సంస్థలు 2,200 కోట్ల డాలర్ల విలువ కలిగి ఉన్నాయి.
  • భారతీయ ఫిన్‌టెక్‌ కంపెనీలు 1,000 కోట్ల డాలర్ల మూలధనాన్ని ఆకర్షించాయి. డిజిటల్‌ చెల్లింపులు బాగా పెరగడంతో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
  • భవిష్యత్‌లో సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ (సాస్‌) రంగం కూడా పెట్టుబడుల్ని బాగా ఆకర్షించే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం 7,000కు పైగా సాస్‌ కంపెనీలున్నాయి.
  • విద్యా సాంకేతిక రంగం కూడా ఆశావహంగానే ఉండనుంది. దేశంలో 2025 నాటికి ఎడ్యుటెక్‌ విపణి 5 రెట్లు పెరిగి, 400 కోట్ల డాలర్ల స్థాయికి చేరనుంది. కె-12 విభాగంలో 150 కోట్ల డాలర్ల అవకాశాలున్నాయి.
  • వ్యాపారవేత్తలు కొత్త వెంచర్లలో పెట్టుబడులు పెడుతుండటంతో యూనికార్న్‌ల సంఖ్య మరింత పెరగొచ్చు. చాలా యూనికార్న్‌లు త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

ఈ నగరాల్లో
బెంగళూరు, దిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబయిలలో అధికం
ఈ రంగాల్లో
టెక్‌-ఆధారిత రంగాలు, ఫార్మాస్యూటికల్స్‌, వినియోగ వస్తువుల కంపెనీలు ఈ యూనికార్న్‌ల్లో ఉన్నాయి.

ఇదీ చదవండి: అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.