ETV Bharat / business

సుంకం తగ్గిస్తాం సరే.. ఇంతకీ భారత్‌లో మీరేం చేస్తారు? - టెస్లా సుంకాల తగ్గింపు వినతిపై ప్రభుత్వం స్పందన

ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' సీఈఓ ఎలాన్​ మస్క్..​ భారత్​ సుంకాలు తగ్గించాలన్న వాదనపై కేంద్రం స్పందించింది. తాము సుంకాలు తగ్గిస్తే.. కంపెనీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటో వివరంగా సమర్పించాలని టెస్లాను కోరింది. భారత్‌లోనే కార్ల తయారీ పరికరాలను సమకూర్చుకోవాలని కూడా కోరినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

Tesla, Elon Musk
టెస్లా, ఎలాన్​ మస్క్​
author img

By

Published : Aug 13, 2021, 5:04 PM IST

Updated : Aug 14, 2021, 6:16 AM IST

భారత్‌లోకి ప్రవేశించడంపై మీనమేషాలు లెక్కిస్తున్న ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ టెస్లా ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ సంస్థ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ కోరినట్లుగా దిగుమతి సుంకాలు తగ్గిస్తే.. భారత్‌లో కార్యాచరణ ఏంటో వివరించాలని కోరింది. ఈ మేరకు గత నెల ప్రభుత్వం, సంస్థ ప్రతినిధులు మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

పూర్తిగా అనుసంధానించిన కార్లను దిగుమతి చేసుకోవడం కంటే.. పరికరాలను యూనిట్ల వారీగా దిగుమతి చేసుకుంటే తక్కువ సుంకాలు వర్తిస్తాయని ఈ సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తెలిపినట్లు అధికారి పేర్కొన్నారు. దీనిపై తమ అభిప్రాయం తెలపాలని టెస్లాను కోరినట్లు తెలిపారు. అలాగే దిగుమతి సుంకాలను తగ్గిస్తే భారత్‌లో చేపట్టబోయే పనులకు సంబంధించిన పూర్తి కార్యాచరణను సమర్పించాలని అడిగినట్లు పేర్కొన్నారు. మరోవైపు భారత్‌లోనే కార్ల తయారీ పరికరాలను సమకూర్చుకోవాలని కూడా కోరినట్లు వెల్లడించారు.

భారత్‌లో ఇప్పటి వరకు 100 మిలియన్‌ డాలర్లు విలువ చేసే పరికరాలను కొనుగోలు చేసినట్లు టెస్లా ప్రతినిధులు తెలిపారు. పన్నులు తగ్గిస్తే ఈ విలువ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే విక్రయాలు, సేవలు, ఛార్జింగ్‌ వసతుల్లో ప్రత్యక్ష పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. ఇలా భారత్‌లోకి దశలవారీగా ప్రవేశించి పూర్తి స్థాయి తయారీలో పెట్టుబడులు ప్రారంభిస్తామని స్పష్టం చేసినట్లు అధికారి వెల్లడించారు.

ఎలాన్ మస్క్ షరతు..

జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా గత కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. అయితే, సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ ఓ షరతు విధించారు. తొలుత విదేశాల్లో తయారైన తమ కార్లను భారత్‌లో విక్రయిస్తామని తెలిపారు. తర్వాతే స్థానికంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని తేల్చి చెప్పారు. అంతకంటే ముందు కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇటీవల దీనిపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణపాల్‌ గుర్జర్‌ పార్లమెంటులో స్పందించారు. దిగుమతి సుంకాన్ని తగ్గించే ప్రతిపాదనేదీ ప్రభుత్వం దృష్టిలో ప్రస్తుతానికి లేదని స్పష్టం చేయడం గమనార్హం.

ఇవీ చదవండి:

Last Updated : Aug 14, 2021, 6:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.