ETV Bharat / business

పెట్రోల్ ధరలు తగ్గేలా అంతర్జాతీయంగా మోదీ ప్రయత్నాలు!

చమురు ఉత్పత్తి దేశాలు, దిగ్గజ ఆయిల్ కంపెనీల సీఈఓలు భారత్​లో సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా.. చమురు ధరలు తగ్గించాలని భారత్ ఆయా దేశాలను కోరనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం వీరితో భేటీ కానున్నారు.

India will push for cut in crude prices in oil industry leaders meet

author img

By

Published : Oct 19, 2021, 6:20 PM IST

దేశంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ఇంధన ధరలకు కళ్లెం (Petrol Price reduce news) వేసేలా కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో కసరత్తులు చేస్తోంది. చమురు ఉత్పత్తి దేశాల ఇంధన మంత్రుల సమావేశం (Ceraweek Conference) దిల్లీలో జరగనున్న నేపథ్యంలో.. అంతర్జాతీయ మార్కెట్​లో ధరలను తగ్గించేలా (Petrol price reducing) వీరిని కోరే అవకాశం ఉంది. ధరలు తగ్గించాలని ఒపెక్ దేశాలతో పాటు చమురు ఉత్పత్తి చేసే దేశాలను కోరుతూనే ఉన్నామని పెట్రోలియం శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని దిల్లీలో జరిగే సమావేశంలోనూ ప్రస్తావిస్తామని చెప్పారు.

'ధరలు తగ్గిస్తే చమురు ఉత్పత్తి దేశాలకూ ప్రయోజనకరమని మేం చెబుతూ ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాల రికవరీ స్తబ్దుగా ఉంటే.. ఇంధన డిమాండ్ పడిపోతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు (Crude Oil Price) పడిపోతాయి. అది ఆయిల్ ఉత్పత్తి దేశాలకు మంచిది కాదు' అని ఈటీవీ భారత్​తో పెట్రోలియం శాఖ అధికారులు వెల్లడించారు.

మోదీ చర్చలు

ప్రపంచంలో చమురును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు.. దిల్లీలో అక్టోబర్ 20-22న సమావేశం కానున్నాయి. సెరా వీక్ కాన్ఫరెన్స్ (Ceraweek global energy) కోసం ఆయా దేశాల ఇంధన శాఖ మంత్రులు, చమురు సంస్థల ప్రతినిధులు భారత్​కు రానున్నారు. భారత్ తరఫున పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఈ సమావేశానికి హాజరవుతారు. దీనికి అనుబంధంగా నిర్వహించే ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దిగ్గజ చమురు సంస్థల సీఈఓలు, నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ సమావేశమవుతారని ప్రధాని కార్యాలయం తెలిపింది. పెట్రోలియం నిక్షేపాల అన్వేషణ, భారత్​లోని హైడ్రోకార్బన్ రంగంలో ఉత్పత్తి, ఉద్గారాల తగ్గింపు వంటి అంశాలు చర్చకు రానున్నట్లు వెల్లడించింది.

ధరల పెరుగుదల కారణాలివే!

చమురు నిక్షేపాలను గుర్తించేందుకు తగినంత పెట్టుబడులు పెట్టకపోవడం, ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయని పెట్రోలియం శాఖ సీనియర్ అధికారులు చెబుతున్నారు. సౌర, పవన, హైడ్రో పవర్ విద్యుత్ వైపు వినియోగదారులు మొగ్గుచూపుతున్నందున.. చమురు నిక్షేపాల అన్వేషణకు పెట్టుబడిదారులు ముందుకు రావడంలేదని చెప్పారు.

అయితే, దిల్లీలో జరిగే సెరా సమావేశంలోనూ ఇదే అంశంపై (Ceraweek 2021 Theme) ప్రధానంగా చర్చ జరగనుండటం యాదృచ్ఛికం. ధరలు పెరిగితే చమురు నుంచి ఇతర ఇంధన మార్గాల్లోకి పరివర్తనం వేగవంతంగా జరుగుతుందా అనే అంశంపై వీరంతా చర్చించనున్నారు. స్వల్పకాలికంగా ధరలు పెరిగినా ఈ ప్రభావం ఉంటుందా అని సమాలోచనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారత్ సైతం ధరలు తగ్గించాలని కోరే అవకాశం ఉన్నందున.. దీనిపై చమురు ఉత్పత్తి దేశాలు ఏ నిర్ణయం తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: Crude Oil Price: మూడేళ్ల గరిష్ఠానికి క్రూడాయిల్​ ధరలు- మరి భారత్​లో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.