ETV Bharat / business

ఇరాన్ నుంచి చమురు కొనుగోలుకు భారత్​ సిద్ధం! - ఇరాన్​ నుంచి​ ముడి చమురు కొనుగోలు

ఇరాన్ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించే దిశగా అగ్రరాజ్యం సమాయత్తమవుతోంది. ఈ మేరకు అమెరికా సహా.. ఇతర దేశాలు వియన్నాలో సమావేశమవనున్నాయి. ఇరాన్​పై అమెరికా ఆంక్షలు ఎత్తివేసిన అనంతరం ఆ దేశం నుంచి​ ముడి చమురు కొనుగోలు చేసే యోచనలో ఉంది భారత్.

India to resume buying oil from Iran once US sanctions ease says Official
ఆంక్షల సడలింపుతో భారత్​కు ఇరాన్ చమురు దిగుమతులు
author img

By

Published : Apr 9, 2021, 12:12 PM IST

భారత ప్రభుత్వ రంగ చమురు రిఫైనరీ కంపెనీలు ఇరాన్​ నుంచి చమురు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి వీలుగా వాణిజ్య షరతులతో ముసాయిదా సిద్ధం చేసినట్లు చమురు శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇరాన్​పై అమెరికా ఆంక్షలు సడలించినట్లయితే ఆ దేశం నుంచి ముడి చమురు కొనుగోలును తిరిగి ప్రారంభించేందుకు భారత్ సిద్ధంగా ఉందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇరాన్ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి అమెరికాతో పాటు ఇతర ప్రపంచ దేశాలు వియన్నాలో సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

చమురు ధరల విషయంలో భారత్, సౌదీ అరేబియాల మధ్య వివాదం ఏర్పడిన నేపథ్యంలో ప్రత్యామ్నాయాల వైపు చూడాలని రిఫైనరీలకు ఇటీవలే కేంద్రం సూచించింది. అమెరికాలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం కూడా ఇరాన్​పై ఆంక్షలు సడలిస్తున్నందన్న అంచనాలున్నాయి.

ఇది జరగ్గానే భారత్​ కొనుగోళ్లు ప్రారంభిస్తుందని సమాచారం. ఒకప్పుడు ఇరాన్ చమురుకు అతిపెద్ద రెండో వినియోగదారుగా ఉన్న భారత్ మళ్లీ ఆ దేశం నుంచి కొనుగోళ్లకు సిద్ధపడుతోంది. ఈ విషయంపై స్పందించేందుకు ఐఓసీఎల్, హెచ్​పీసీఎల్​, బీపీసీఎల్​ ప్రతినిధులు నిరాకరించారు.

''ఇరాన్​ ముడి చమురు దిగుమతులు కానున్న నేపథ్యంలో దేశీయ రిఫైనరీలు సన్నాహకాలు చేసుకుంటున్నాయని.. ఆంక్షలు ఎత్తివేసిన వెంటనే ఒప్పందాలు కుదురే అవకాశం ఉన్నట్లు'' పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు వెల్లడించారు.

ఇవీ చదవండి: ముడిచమురు ఎగుమతుల్లో ఆసియా దేశాలకు సౌదీ కోత

చమురు ఉత్పత్తి పెంపునకు ఒపెక్​ దేశాల నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.