ETV Bharat / business

'విద్యుత్​ వాహనాల తయారీలో అగ్రగామిగా భారత్!​' - దేశంలో హరిత ఇంధనం

అతిత్వరలో.. విద్యుత్​ వాహనల తయారీలో ప్రపంచంలోనే భారత్​ అగ్రస్థానంలో నిలుస్తుందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఆరు నెలల్లో లిథియం అయాన్​ బ్యాటరీలను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసే స్థాయికి భారత్​ చేరుకుంటుందని తెలిపారు.

nitin gadkari
'ఈవీల తయారీలో త్వరలోనే నం.1గా భారత్​'
author img

By

Published : Apr 18, 2021, 8:27 PM IST

రాబోయే ఆరు నెలల్లో లిథియమ్​ అయాన్​ బ్యాటరీలను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయగలగే స్థాయికి భారత్​ చేరుకుంటుందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ పేర్కొన్నారు. నిర్ణీత సమయంలోగా.. విద్యుత్​ వాహన(ఈవీ) తయారీ రంగంలో భారత్​ అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. అమెజాన్​ స్మభవ్​ సదస్సులో ఆయన వర్చువల్​గా పాల్గొన్నారు.

"విద్యుత్​ వాహన తయారీ వైపు భారత్​ అడుగులు వేస్తోంది. అతిత్వరలోనే.. విద్యుత్​ వాహన తయారీ రంగంలో ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుంది. భారత్​లో ఎన్నో ప్రసిద్ధ బ్రాండ్​ కంపెనీలు వీటిని తయారు చేయనున్నాయి. హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయటంలో భారత్​కు అద్వితీయమైన సామర్థ్యాలు ఉన్నాయి. ఆరు నెలల్లో లిథియం అయాన్​ బ్యాటరీలను 100 శాతం తయారు చేసే స్థాయికి ఎదుగుతుందని నేను విశ్వసిస్తున్నాను."

-నితిన్​ గడ్కరీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి

హైడ్రోజన్​ ఇంధన సాంకేతికను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోందని గడ్కరీ తెలిపారు. కాలుష్యాన్ని నిరోధించటంలో విద్యుత్​ వాహనాల వాడకం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో విద్యుత్​ వాహనాల ధరలు తగ్గి.. డీజిల్​, పెట్రోల్​ వాహనాల అమ్మకంలో గట్టి పోటీనిస్తాయని చెప్పారు. ఆటోమొబైల్​ పరిశ్రమలో భారత్​ను ప్రథమ స్థానంలో నిలిపే లక్ష్యంతో.. మిథనాల్​, ఇథనాల్​, బయో-సీఎన్​జీ, విద్యుత్​, హైడ్రోజన్​ వాహనాల ఉత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వెల్లడించారు.

ఇదీ చూడండి: బంగారం దిగుమతులు 22.58 శాతం జంప్​

ఇదీ చూడండి: భారీగా తగ్గిన ప్రయాణికుల వాహన ఎగుమతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.