2020 జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే దేశంలో ఇళ్ల ధరలు ఈ ఏడాది అదే సమయంలో 1.6శాతం మేర తగ్గాయని నైట్ ఫ్రాంక్ పరిశోధనా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా గృహాల ధరల్లో వార్షిక వృద్ధి ఎలా ఉందనే అంశంపై నైట్ ఫ్రాంక్ రూపొందించిన నివేదికలో భారత్కు 55వ స్థానం లభించింది. స్థిరాస్తి ధరలు 32శాతం పెరగటం వల్ల ఈ నివేదికలో టర్కీ అగ్రస్థానం దక్కించుకుంది.
56 దేశాలతో రూపొందించిన ఈ నివేదికలో భారత్ 55వ స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. 56వ స్థానంలో స్పెయిన్ నిలిచింది.
గత మార్చిలో విడుదల చేసిన నివేదికలో 56వ స్థానంలో ఉన్న భారత్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుంది. 2020 తొలి త్రైమాసికంలో 43వ స్థానంలో ఉండగా, తాజాగా 12 స్థానాలు కోల్పోయింది. స్పెయిన్లో 1.8శాతం ధరలు క్షీణించగా, భారత్లో 1.6శాతం మేర క్షీణించినట్లు. నివేదిక తెలిపింది.
తొలి 3 స్థానాల్లో నిలిచిన దేశాల్లో ధరల వృద్ధి ఇలా..
దేశం | ధరల్లో వృద్ధి |
టర్కీ | 32 శాతం |
న్యూజిలాండ్ | 22.1 శాతం |
లగ్జెంబర్గ్ | 16.6 శాతం |
ఇదీ చదవండి:ఏటీఎం లావాదేవీలు ఇక మరింత భారం