దేశీయంగా ఎగుమతులు 58.23 శాతం పెరిగి 34 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మార్చిలో ఇంజినీరింగ్, జ్యూవెలరీ, ఔషధాలు వంటి కీలక రంగాలు రికార్డు స్థాయిలో వృద్ధిని నమోదు చేసిట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక నెలలో ఈ స్థాయిలో ఎగుమతులు పెరగడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. అయితే గతేడాది ఇదే నెలతో పోల్చితే ఎగుమతులు 7.4 శాతం తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి.
ఇదే సమయంలో 2020-21లో దిగుమతులు 18 శాతం మేర తగ్గి 388.92 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2020 మార్చి నెలలో ఎగుమతులు 21.49 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచంలోని అన్నీ రంగాలు డీలా పడ్డాయి. 2019 మార్చి నాటి గణాంకాలతో పోలిస్తే 34 శాతం క్షీణించాయి. దిగుమతులు కూడా 52.89 శాతం పెరిగి 48.12 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇవి 2020 మార్చిలో 31.47 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ముడి చమురు దిగుమతులు 1.22 శాతం పెరిగాయి. బంగారం దిగుమతులు 7.17 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందాయి.
ఇదీ చూడండి: చైనాకు పెరిగిన ఇంజినీరింగ్ ఎగుమతులు