ETV Bharat / business

2021 తొలినాళ్లలో భారత్​లో కరోనా టీకా! - కరోనా వ్యాక్సిన్​ ధర అంచనాలు

భారత్​లో వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కరోనా వ్యాక్సిన్ వినియోగానికి అందుబాటులోకి రావచ్చని ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్ జరుపుకుంటున్న 4 ప్రధాన టీకాల్లో రెండు.. భాగస్వామ్య పద్దతిలో భారత్​ అందుబాటులోకి రావచ్చని తెలిపింది.

India get Corona vaccine by Next Year
వచ్చే ఏడాదే భారత్​లో కరోనా టీకా
author img

By

Published : Aug 28, 2020, 6:47 PM IST

కరోనా వైరస్​కు సంబంధించి వ్యాక్సిన్​ ట్రయల్స్ వేగంగా జరుగతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో వినియోగానికి ఆమెదం పొందిన కొవిడ్-19 వ్యాక్సిన్​ భారత్​లో అందుబాటులోకి రావచ్చిన బెర్న్​స్టీన్ నివేదిక ద్వారా తెలిసింది.

ప్రపంచవ్యాప్తంగా 4 సంస్థల వ్యాక్సిన్​లు ప్రస్తుతం తుది అనుమతులు పొందే రేసులో ముందు వరుసలో ఉన్నాయని నివేదిక తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ వ్యాక్సిన్​లకు అనుమతులు లభించొచ్చని పేర్కొంది.

భాగస్వామ్య ఒప్పందం ద్వారా వీటిలో ఆక్స్​ఫర్డ్ రూపొందిస్తున్న 'వెక్టర్​ వ్యాక్సిన్​', నోవావాక్స్ తయారు చేస్తున్న 'ప్రొటీన్​ సబ్నిట్​ వ్యాక్సిన్'​ భారత్​లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని బెర్న్​స్టీన్ నివేదిక వెల్లడించింది.

1,2వ దశ ట్రయల్స్ డేటా ప్రకారం ఈ రెండు టీకాలు భద్రత, సామర్థ్యం పరంగా ఉత్తమ పని తీరు కనబర్చరినట్లు తేలిందని నివేదిక వివరిచింది. వీటికి తుది అనుమతులు లభిస్తే.. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో దేశీయంగా వినియోగానికి అందుబాటులోకి రావచ్చని వెల్లడించింది.

టీకా ధర..

భారత్​లో కరోనా వ్యాక్సిన్ ధర డోసుకు రూ.255 నుంచి రూ.550 వరకు ఉండొచ్చని అంచనా వేసింది నివేదిక.

అయితే భారత్​లో వయోజనులకు ఒకేసారి భారీ స్థాయిలో టీకా అందించేందుకు సవాళ్లు ఎదురవుతాయని నివేదిక పేర్కొంది. ఫలితంగా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేందుకు భారత్​కు రెండేళ్లు పట్టొచ్చని తెలిపింది. గతంలో వయోజనులకు ఒకేసారి భారీ స్థాయిలో టీకా అందించిన అనుభవం లేకపోవడం, కోల్డ్ స్టోరేజీ వ్యవస్థ, సిబ్బంది కొరత వంటివి ఇందుకు ప్రధాన అడ్డంకులుగా పేర్కొంది.

ఇదీ చూడండి:జీఎస్టీ పరిహారంపై బిహార్​ రూటే సెపరేటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.